Thursday, November 7, 2024

టీఆర్ఎస్ విజయగర్జన సభ 29కి వాయిదా

నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబర్ 29 వ తేదీన నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ నేతలు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి తదితర పార్టీ ముఖ్యనేతలు వరంగల్లు సమావేశంలో ముక్త కంఠంతో చేసిన అభ్యర్థన మేరకు సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.

నాటి ఉద్యమ రథసారథిగా ‘తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో ’ అనే నినాదంతో సిఎం కెసిఆర్ ప్రారంభించిన ‘దీక్షా దివస్’ నవంబర్ 29 తేదీయే తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు తమ అభిప్రాయాలను సిఎం కెసిఆర్ కు విన్నవించారు. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి స్వరాష్ట్ర సాధనకు మూలమైన  ‘దీక్షా దివస్’ రోజే జరపాలని వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సిఎం కెసిఆర్ తెలంగాణ విజయ గర్జన సభను నవంబర్ 29 వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు,.

ఈ నేపథ్యంలో … చారిత్రాత్మక తెలంగాణ విజయ గర్జన సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయడానికి ఇప్పటికే కమిటీలు వేసుకోని ముమ్మరంగా కృషిచేస్తూ ఏర్పాట్లల్లో నిమగ్నమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల  టిఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని గమనించాలని సిఎం తెలిపారు.  ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను  (ఈ నెల) నవంబర్ 29 వ తేదీకి మార్చుకోవాలని సిఎం సూచించారు. తేదీ మార్పు విషయాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలకు తెలియచేయాలన్నారు.

[

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles