- బీజేపీలో చేరిన మాజీ శాసనమండలి అధ్యక్షుడు
- మాట్లాడాలంటే రెండు నిమిషాల సమయం ఇవ్వని కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితిలో వలస నాయకులకు ఉన్నప్రాధాన్యం, మొదట నుంచి పార్టీని నమ్ముకున్న వారి లేదని శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఆరోపించారు. ఉద్యమంలో ఏనాడూ పాల్గొనని వారికి పదవులు కట్టబెట్టారని, పార్టీల నుంచి తీసుకోవడం బాగాలేదని అన్నారు. కొందరు టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ అనుయాయులు అంటున్నట్లు, తాను రోడ్డు మీద ఖాళీగా ఉంటే తెచ్చి ఆ పదవి ఇవ్వలేదని, తెలంగాణ ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించానని చెప్పారు.
ఆత్మాభిమానం చంపుకొన టీఆర్ఎస్ లో ఇమడలేకే బీజీపీలో చేరాను తప్ప పదవుల కోసం కాదని స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును తండ్రిలా భావించానని, అయితే, చెప్పుడు మాటలు విని తనను పక్కన పెట్టారని అన్నారు. మాట్లాడేందుకు రెండు నిమిషాల సమయం కూడా తనకు ఇవ్వలేదని గురువారం అన్నారు. పోలీసులు తనను చంపడానికి రెండుసార్లు ప్రయత్నించారని స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: గ్రేటర్ ‘సుడి’లో తెలుగు తేజాలు