- ఎమ్మెల్సీకి తప్పిన పెనుప్రమాదం
- ఒకదానికొకటి ఢీ కొట్టుకున్న కార్లు
- సురక్షితంగా ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం(ఫిబ్రవరి 25) జగిత్యాల జిల్లా పర్యటనలో ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకుండా అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు, రాయికల్ మార్గంలో మల్యాల మండలం,రాజారం వద్ద కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ అదుపుతప్పింది. ప్రమాదంతో ఆ ప్రాంతంలో కాసేపు ట్రాఫిక్ జాం అయింది. దీంతో మరో కారులో కవిత బయలుదేరి వెళ్లారు.
నాగాలయంలో ప్రత్యేక పూజలు:
కవిత ఈ రోజు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలోని నాగేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగేంద్ర స్వామికి పంచామృతంతో అభిషేకం చేశారు.
అనంతరం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తర్వాత కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే మార్గంలో ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీకవితతో సింగరేణి ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతల భేటి