టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో పలు జిల్లాల అధ్యక్షులు అధినేత, సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు.
సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామక్రిష్ణారెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ లు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు తదితరులున్నారు.
హన్మకొండ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా నియమితులైన ఎంపీ మాలోత్ కవిత లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లు ఉన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబు నగర్ జిల్లా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య ఉన్నారు.
ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. భద్రాద్రి కొత్త గూడెం అధ్యక్షుడు ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా గిరిజన నేతలకు అధ్యక్ష పదవుల్లో ప్రాధాన్యతనిచ్చినందుకు గిరిజన నేతలు ఆత్రం సక్కు, కోరం కనకయ్య, కోవా లక్ష్మి లు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.