నాగార్జునసార్ నియోజకవర్గ ఉప ఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హాలియా మున్సిపాలిటీ ఇంఛార్జ్ గా సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ను సీఎం కేసీఆర్ నియమించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహం లో భాగంగా రాష్ట్రంలో ని పలువురు ఎమ్మెల్యేల ను అక్కడ మోహరిస్తున్నారు.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో పలుమార్లు సర్వేలు నిర్వహించిన సిఎం కేసిఆర్ స్వయంగా ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా హాలియా పట్టణ టిఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ప్రచారం నిర్వహణ తీరుతెన్నులపై స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రచారంలో ప్రతీ గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించేవిధంగా వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు కార్యకర్తలకు ద్వితీయ శ్రేణి నేతలకు పలు సూచనలు చేశారు.
Also Read: మూడో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు