భారతీయ ఆంగ్ల కవులు-8
త్రిషాని దోషి చెన్నైకి చెందిన ప్రఖ్యాత కవయిత్రి. తన కవిత్వంలో ఆధునిక పోకడైన ప్రతీకాత్మకత కనిపిస్తుంది. వాటిద్వారా మామూలు పదాల్లో సూటిగా చెప్పలేని అనేక విషయాలు చెప్ప గలుగుతారు. “రైన్ ఎట్ త్రి” అనే కవితలో వర్షం వచ్చి పరుపు దిండు తడిశాయంటారు. ‘నిన్న తీసిన కలుపు’ అంటే గతంలోని చేదు జ్ఞాపకాలు మనసులోనుండి తొలగించే ప్రయత్నం. కాల గమనంలో అవి మరుగున పడతాయి. కాని అంత వరకు వాటిని మోయకుండా పయత్న పూర్వకంగా వాటిని వదిలించుకోవడం మంచిది. మన శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకున్నట్లుగా మనసులోని అనుభూతులను తొలగించు కోవాలి. కాని మన శరీరం చెక్కది కానట్లుగానే మనసు కూడా ఏ అనుభూతులు లేని చెక్క కాదు. కాబట్టి అంతర్ముఖులమై పూరేకుల్లాంటి అనేక సద్భావనలను ఏరుకోవాలి. జీవితచక్రంలో మొదట విడదీసి చూసు కోవడం ఆ తరువాత కలుపేసుకోవడం, వియోగం తరువాత సంయోగం సహజo. ఆధ్యాత్మిక మార్గంలో ఇలాగే ముందుకు సాగుతారు.
Also read: అరుంధతీ సుబ్రహ్మణ్యంఅరుంధతీ సుబ్రహ్మణ్యం
Also read: జీత్ తాయిల్
Also read: శివ్ కె కుమార్
Also read: కేకి దారూవాలా
Also read: జయంత్ మహాపాత్ర
Also read: నిస్సిం ఎజేకియల్
Also read: ఎకె రామానుజం