సత్యనారాయణ శాస్త్రి (బాంబు) ప్రథమ వర్ధంతి సమావేశం నివాళి
పిఠాపురంలోని నివాసగృహంలో వంద మందికి పై చిలుకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన మిత్రులు, కుటుంబశ్రేయోభిలాషుల సమక్షంలో సత్యనారాయణ శాస్త్రి(బాంబు) ప్రథమ వర్ధంతి జరిగింది. ఎప్పుడూ వెన్నంటి ఉండే స్థానిక మిత్రులు రాజు, సుధాకర్, రాజా, కరీంల ఆద్వర్యంలో, ఇతర స్నేహితుల ప్రోత్సాహంతో అసలు ఏమాత్రం ముందుగా సమావేశం అనుకో నప్పటికీ చాలా అబ్బురంగా, నిరాడంబరంగా జరిగింది!
ముంబాయి నుండి పెద్దలు, ఎన్నో ఉద్యమా ల్లో భాగస్వామి, నిరంతర సంచారి మానవ వాహిణి గరిమెళ్ళ నారాయణ గారి నుండి గుంటూరు నుండి వచ్చిన జయరావు వరకూ, తిరుపతి నుండి కుటుంబ సమేతం గా వచ్చిన మిత్రుడు దిలీప్ , శరణ్యల నుండి విజయ నగరం కె. యస్. ఫౌండేషన్ తరపున విచ్చేసిన పెద్ద సాయి తదితరుల వరకూ అటు శ్రీకాకుళం నుండి ఇటు రాజమండ్రి దాకా చత్తీస్‌గఢ్ రాయపూర్ నుంచి పదుల సంఖ్యలో అభిమానంగా విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు!
జన విజ్ఞాన వేదిక డా. చెలికాని స్టాలిన్, కళ్యాణి సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ మన్మధరావు, సహృదయ మిత్రమండలి సతీష్, అప్పారావు గారు, మద్యపాన వ్యతిరేక సమితి నానిబాబు, సూర్య నారాయణ, జాహ్నవి సాంస్కృతిక సంస్థ కృష్ణారావు, త్రిమూర్తులు, సూర్యరాయ విద్యానంద లైబ్రరీ కొండేపూడి శంకరరావు, మన ఊరు మన బాధ్యత నగేష్, ఫ్రెండ్స్ న్యూస్ ఏజన్సీ స్టాలిన్, జర్నలిస్టు దత్తు, పురూహుతికా లలితకళాపరిషత్ సిసి ఆర్ టి ప్రసాద్ ,మాదేటిరాజాజీ మెమోరియల్ రవి ప్రకాష్, అడుగుజాడ ప్రచురణల రవికాంత్ తదితరులు ఆత్మీయంగా పాల్గొన్నారు!
సత్యనారాయణ శాస్త్రి (బాంబు) జీవితం, కృషికి సంబంధించి విలువైన సమాచారంతో సంకలనం చేసిన ఏకవ్యక్తి సైన్యం పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది. సత్య నారాయణ జీవితం గురించి, సామాన్య పాత్రికేయుడిగా పని చేస్తూనే ఎన్నో అసామాన్య కార్యక్రమాల రూపకల్పన చేసిన ఆయన అసమాన ప్రతిభ గురించి క్లుప్తంగా మాట్లాడిన వక్తలు ఈ రోజు ఆ ప్రశ్నించే తత్వాన్ని నిర్భయతను కాపాడు కోవడం అవసరం అన్నారు!
ఒక్క ఏడాది కాలంలో వేదిక తీసుకుని వచ్చిన విశిష్టమైన విభిన్న అనువాదాల్ని, సంకలనాల్ని భోజనాల అనంతరం ఆహుతు లందరికీ మేకా సత్య నారాయణ శాస్త్రి (బాంబు) స్మారక వేదిక తరపున అంద జేయడం జరిగింది. ఇంకా సభలో పాల్గొని సత్యనారాయణగారితో అనుబంధాన్ని ఆత్మీయంగా గుర్తు చేసుకుని నాన్నకి నివాళి అర్పించిన ఇంకా అనేకమంది శ్రేయోభి లాషులు, ఇక్కడ పేర్లు ప్రస్తావించని ఆత్మీయులు అందరికీ మరొక్కసారి ప్రేమ పూర్వక నమస్సులు.
(ముందుగా కచ్చితంగా వస్తా మని చెప్పికూడా పత్తాలేని చుట్టాలు కొద్దిమంది, ఇంకా చివరి క్షణంలో వ్యక్తిగత కారణాల వల్ల కార్యక్రమానికి రాలేకపోయిన శ్రేయోభిలాషులు హిందూపూర్ విద్యా సాగర్, కడప రఘు వంటి వారు కూడా ఉన్నప్పటికీ మొత్తంగా అనుకున్నదానికన్నా చాలా బాగా జరిగిన సమావేశం, జరగడానికి సహకరించిన టీంకు ప్రత్యేక ధన్యవాదాలతో ఈ చిన్న రైటప్.)
Also read: ఏకవ్యక్తి సైన్యం, మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు)
– గౌరవ్