ఆ 8 గంటలు 8 నిముషాలుగా జారిపోయాయి.
సినిమాలు, రాజకీయాలు, హాస్యాలు,
చిరునవ్వులు, నవ్వులు…
నా స్టేషన్ వచ్చింది.
మెల్లగా నా సూటుకేసు దొర్లించుకొంటూ
తలుపువద్దకు వచ్చాను.
వెనుకకు తిరిగి చూడలేదు.
అతని పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అడగలేదు.
అతను అంతే…
ఇంకో రైలు స్నేహం,
ఎప్పటిలాగునే నిర్వికారంగా ముగిసింది.
కానీ ఆమెతో ప్రయాణం అలాంటిది కాదు.
నిముషాలు, గంటలుకాదు… దశాబ్దాలు..
రైలు లేదు, చక్రాలు లేవు,
మధ్య మధ్యలో స్టేషన్ లలో ఆగడం లేదు
…అసలు గమ్యమే లేదు.
మనసులు కోరుకొన్న సుదీర్ఘ ప్రయాణం…
స్థిరమైన నేలపై పాదచారులమై…
ముళ్ల ను దాటుకొంటూ, అడ్డంకులను అధికమిస్తూ
కథలు, వ్యధలు పంచుకొంటూ,.
చుట్టూ ఎవరు లేకపోయినా,
ఒకరి రహస్యాలను ఒకరికి గుసగుసలు గారు చెప్పుకొంటూ,
ఒకరి కళ్ల లోకి ఒకరు చూసుకొంటూ,
నవ్వుకొంటూ…
ఎదో పారవశ్యంలో నడుస్తూ, మాట్లాడుకొంటూ
పోతున్న నాకు ఒక్కసారి స్ఫూరణ వచ్చి చూస్తే
ఆమె నా ప్రక్కన లేదు…
వచ్చిన దారిలో అడుగుజాడలు కనపడలేదు…
ఏమై పోయివుంటుంది?
కొంత సేపు వేచిఉన్నా…
భీతి గొలిపే నిశ్శబ్దాన్ని గుటకలు వేస్తూ…
మరల నడక మొదలు పెట్టా… ఒంటరిగా,
ఎప్పటిలాగే ఆగని కబుర్లు…
కష్టం, సుఖం, హాస్యం, మంచి, చెడు…
చెదరని ధోరణి…
అప్పుడప్పుడు ప్రక్కలకు చూస్తూ,
నవ్వులు విసురుతూ!
ఎక్కడో దగ్గర నుండి తాకుతున్న
ఆమె వేడి నిట్టూర్పులు,
ప్రక్కన్నే నడుస్తూ ‘ఊ’ ‘ఆ’ లు కొడుతున్న ట్లు
సుతిమెత్తని భావన…
అప్పుడప్పుడు గాలిలో తేలి వస్తున్న
రెప రెప లాడే ఆమె చల్లని నవ్వులు…