• ఆలయ అధికారులకు సోకిన కరోనా
• నిబంధనలకు కఠినతరం చేసిన దేవస్వం బోర్డు
• నిలిచిపోయిన సేవలు
శబరిమల అయ్యప్ప దర్శనానికి ఆన్ లైన్ లో వర్చువల్ క్యూ టికెట్ లేనటువంటి అయ్యప్ప భక్తులు దర్శనానికి మరో రెండు మూడు రోజులు ఆగాలని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ సూచించింది. విధుల్లో ఉన్న ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో గత పది రోజుల నుంచి వారందరకూ హొంక్వారంటైన్ లో ఉన్నారు. దేవస్థానంలో ఉన్న కింది స్థాయి ఉద్యోగులకు ఎలాంటి సమాచారం లేనందున ఆన్ లైన్ లో సేవలు నిలిచిపోయినట్లు దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ఉన్నతాధికారులు విధులకు హాజరయ్యేందుకు మరో మూడు రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా 5 వేల రూపాయల టికెట్ పై దర్శనం చేసుకోవచ్చా లేదా అన్న దానిపై కూడా ఉన్నతాధికారులు విధులకు హాజరయ్యాకే వివరణ ఇస్తామని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు స్పష్టం చేసింది.
కరోనాతో కళ తప్పిన శబరిమల:
శబరిమల ఆలయం ఎల్లపుడూ భక్తుల శరణు ఘోషతో ప్రతిధ్వనిస్తుంటాయి. డిసెంబరులో నిత్యం వేలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అయితే కరోనా కారణంగా ఆలయం పూర్తిగా కళ తప్పిది. నవంబరు 16 నుంచి భక్తుల దర్శనానికి రోజుకు వెయ్యి మంది దర్శనం చేసుకునేందుకు అనుమతినిచ్చారు. అయితే సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు రెండు వేల మంది భక్తులకు, శని ఆదివారాల్లో రోజుకు 3 వేల మంది భక్తుల దర్శనానికి అనుమతనిచ్చారు.
కఠినంగా నిబంధనల అమలు:
శబరిమల దర్శనానికి వచ్చేభక్తులు తప్పనిసరిగా కొవిడ్ నెగిటివ్ టెస్ట్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా శబరిమల ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, పోలీసులకు కరోనా సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ నిబంధనలకు కఠినంగా అమలుచేసేందుకు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు నిర్ణయించింది. డిసెంబరు 26న మండల పూజ జరగనుంది. జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20న అయ్యప్ప ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు.