వెన్నెల కురుస్తోంది
మనసు తడుస్తోంది
చలిచలిగా ఉంది
మను వెచ్చనవుతోంది.
నిశ్శబ్దంగా ఏరు పారుతోంది
అందరూ నిద్రపోతున్నారు
నామది కడలి కల్లోలం చల్లారి
బరువు పెరిగిన విస్తరాకులా
నిశా సంద్ర గంభీరం
ఎల్లెడా అలముకుంటోంది
అది ప్రశాంతతా
కాక నీలకంఠతా,
అది యోగ నిష్టా
కాక చైతన్యం నిద్రపోయిన
సుషుప్తావస్థా,
ముందుకు వెళ్ళిన మనిషి
వెనక్కి రాడనడం
అనుభవ రాహిత్యమా
కాక ముందుకు వెళ్ళడమనేది
ఒక భ్రాంతి అనుకోవాలా
ఏమో, ఎవరు చెప్తారు
ఎవరు చెబితే ఎవరు వింటారు
ఎప్పటికప్పుడు
జిజ్ఞాసికి తెలిసిందే సత్యం
అది నిత్యం అనిత్యం
Also read: విద్యాలయం
Also read: ధుని
Also read: సంభవామి యుగే యుగే
Also read: తపన
Also read: ప్రేమ