భగవద్గీత – 70
`If you want to be a leader, be a servant first` అన్న వివేకానందుడి వాక్యము గుర్తుకు వచ్చింది.
పూర్వము దాదాపు అన్ని వ్యాపార కుటుంబాలలో తమ పిల్లలు తమ కుటుంబ వ్యాపారంలో ప్రవేశించి, ఆ వ్యాపారలావాదేవీలు చూసుకునే ముందు అలాంటి ఒక వ్యాపార సంస్థలోనే తమ పిల్లలని ముందు గుమాస్తాగా పని చేయమనేవారట.
Also read: ఎవరి మనస్సు శాంతితో నిండి ఉంటుంది?
ఎక్కడో ఒకచోట ఒకసారి పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. ప్రపంచపు మొదటి పదిమంది కోటీశ్వరులలో ఒకాయన తన కొడుకుకు వ్యాపార బాధ్యతలు అప్పచెప్పేముందు తన ఉక్కుఫ్యాక్టరీలో అతిపెద్ద, అత్యంత వేడిని వెదజల్లే కొలిమి దగ్గర పనిలో నియమించాడట.
ఎక్కడైనా ఎప్పుడైనా పని నేర్చుకోకుండా పెత్తనం చెలాయిస్తానంటే కుదరదు. ఇది ఒక Management సూత్రము. పెత్తనం చలాయించేవాడికి మొత్తం ఆ పనిగురించి కూలంకషంగా తెలిసి ఉండాలి. ఆటుపోట్లకు తట్టుకోవాలంటే అది అవసరం. అవసరమయినప్పుడు క్రింద స్థాయి పనికూడా తాను చేయగలిగే సమర్ధత ఉన్నవాడే ఒక గొప్ప నాయకుడిగా రాణిస్తాడు.
అసలిదంతా ఎందుకు చెపుతున్నావు నువ్వు అని అడుగుతారేమో… భగవద్గీతలో ఈ శ్లోకం చదువుతున్నప్పుడు ఈ ఆలోచనలు గిర్రున పరుగులెత్తాయి.
Also read: కనులుమూసినా నీ రూపే
నకర్మాణామనారంభా నైష్కర్మ్యం పురుషోశ్నుతే
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి
మానవుడు కర్మారంభము చేయకుండగనే యొగనిష్ఠను పొందజాలడు. అనగా ఏ పనీ చేయకుండా నేర్చుకోకుండా పనిచేయకుండా ఉండే స్థితి (Position) పొందజాలడు.
కాబట్టి Be A Servant First.
Also read: అత్యాశ వినాశకారిణి