Sunday, December 22, 2024

మావోయిస్టు అగ్రనేత వారణాసి సుబ్రహ్మణ్యం దంపతుల అరెస్ట్

మాజీ మావోయిస్టు వారణాసి సుబ్రమణ్యం దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఉదయం మంచిర్యాల క్యాతనపల్లి లో నివసిస్తున్న టివివి నేత గురిజాల రవీందర్ రావు గురించి అందిన సమాచారం మేరకు ఆయన నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రవీందర్రావు ఇంటి కి వారణాసి సుబ్రహ్మణ్యం, ఆయన భార్య విజయలక్ష్మి@ శ్రీధర వచ్చి 20 రోజులు అతని ఇంట్లో నివాసం ఉన్నట్లు రవీందర్ రావు వెల్లడించారు. అనంతరం తెలంగాణ కోల్ బెల్ట్ ఏరియాలో సింగరేణి కార్మిక సమైఖ్య ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకొని రావాలని సమావేశం జరిపినట్లు తెలుస్తోంది.

రవీందర్ ఇంటిలో ఉన్న సమయంలో ప్రతి రోజు బయటకు వెళ్లి  మాజీ సింగరేణి కార్మిక సమాఖ్య నాయకులను, కార్యకర్తలను కలిసి సమాఖ్య అభివృద్ధికి కృషి చేశారు. రెండు మూడు రోజులలో రవీందర్రావు ఇంటికి వారణాసి సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి మళ్ళీ రానున్నారనే సమాచారం అందండంతో పలు ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో సుబ్రమణ్యం దంపతులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వారణాసి సుబ్రహ్మణ్యం @ శ్రీకాంత్ @అమన్ @విమల్, ప్రకాశం జిల్లా, మార్కాపురం నివాసి. ఈయన గతంలో  సుబ్రహ్మణ్యం మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో విధులు నిర్వహించారు.మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ అయిన సింగరేణి కార్మిక సమైఖ్య   లో 1980 లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో పని చేశారు. ఆ తర్వాత 2004 సంవత్సరంలో సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటులో సెంట్రల్ కమిటీ మెంబర్ వరకూ అంచెలంచెలుగా ఎదిగాడు.

Also Read: శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఆపరేషన్ చబుత్ర

సుబ్రమణ్యం సిపిఐ మావోయిస్టు పార్టీ నార్త్ రీజినల్ బ్యూరో లో ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హర్యానా, పంజాబ్ ఢిల్లీ ప్రాంతాలలో పనిచేస్తూ 2011 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో అరెస్ట్ అయ్యారు.  2019లో బెయిలుపై వచ్చిన వెంటనే మరలా సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీని కలిసి వారి సూచన మేరకు తెలంగాణ ప్రాంతంలో కోల్ బెల్ట్ ఏరియాలో సింగరేణి కార్మిక సమైఖ్య ను పునర్ నిర్మాణం చేసి పూర్వవైభవం తీసుకొనిరావాలనే ఉద్దేశంతో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం మొదలు పెట్టారు. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి  లో తన పూర్వ సహచరుడైన గురజాల రవీందర్రావు ఇంటి  కి నవంబర్ 2020 లో తన భార్యతో సహా వచ్చి 20 రోజులు ఉండి కోల్ బెల్ట్ ఏరియాలో  తిరుగుతూ పార్టీ పూర్వ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వెళ్ళారు. ఉత్తర భారత దేశంలో పార్టీ కార్యకలాపాలలో పాల్గొనే రవీందర్రావుకి ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళీ  చండీఘడ్ నుండి భార్యతో కలిసి వస్తున్న క్రమంలో పోలీసులు విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్

విజయలక్ష్మి@ శ్రీధర W/o వారణాసి సుబ్రహ్మణ్యం, సీపీఐI మావోయిస్టు ఢిల్లీ సిటీ కమిటీ బెంగళూరుకు చెందిన ఈమె 1990లో బ్యాంక్ ఆఫ్ మైసూర్ లో పనిచేస్తూ వారణాసి సుబ్రహ్మణ్యం ను వివాహం చేసుకున్నారు. తరువాత 1996లో వీఆర్ఎస్ తీసుకుని వారణాసి సుబ్రహ్మణ్యం తోపాటు పార్టీ లో పనిచేస్తూ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీకి కమిటీ లో పని చేస్తున్న సమయంలో 2011 లో వారణాసి సుబ్రహ్మణ్యం అరెస్టయిన వెంటనే పార్టీ సూచన మేరకు షెల్టర్లు మారుస్తూ పలు ప్రాంతాలలో డెన్ లను నిర్వహిస్తూ 2019లో వారణాసి సుబ్రహ్మణ్యం బెయిల్ పై బయటకు వచ్చారు. పార్టీ నిర్ణయం మేరకు 2020 జనవరిలో వారణాసి సుబ్రహ్మణ్యం కలిసి అతనితో పాటు కార్యకలాపాలలో పాలు పంచుకున్నారు. నవంబర్ 2020లో క్యాతనపల్లి గ్రామంలో గురజాల రవీందర్రావు ఇంటికి వచ్చి 20 రోజులు ఉండి పార్టీ కార్యకలాపాలలో తన భర్తతో సహా పాల్గొని సింగరేణి కార్మిక సమైఖ్య పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. తాజాగా చండీఘడ్ నుండి క్యాతనపల్లికి వచ్చే క్రమంలో విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు.

 సుబ్రమణ్యం దంపతుల నుంచి లాప్ టాప్, మొబైల్ తో పటు విప్లవ సాహిత్యంతో పాటు పలు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న పుస్తకాలు, విలువైన వస్తువుల వివరాలు:

Also Read: న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుడు వెల్ది వసంత రావు అరెస్ట్

1.లాప్ టాప్

2.శాంసంగ్ మొబైల్    

3.మెమరీ కార్డు

లక్ష్మి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు

1.శాంసంగ్ మొబైల్

2. నోకియ మొబైల్

స్వాధీనం చేసుకున్న పుస్తకాల వివరాలు:

1.PARTY PROGRAMME  

2.POLITICAL RESOLUTION  

3.అమరావీరులకి జోహార్లు   

4.RESOLUTION OF THE  6th CCM  

5.దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తీర్మానాలు   

6.DKSZC SECRETAIAT RESOLUTIONS  

7.మన పార్టీ 50 వ వార్సికోత్శావాలకి విప్లవ జేజేలు  

8.Revolutionary greetings to the fiftieth Anniversary of Our Party  

09.సి సి 1 వ సమావేశం తీర్మానాలు  2017 ఫిబ్రవరి  

10.C C 5th Conference Resolutions February 2017  

11.పత్రిక రంగంపై సమీక్ష నిర్ణయం   

12.Central Committee (P) CPI (Maoist)  

13.Communist Party of India (Maoist) Central Committee  

14.భారత కమ్యునిస్ట్ పార్టీ ( మావోయిస్టు) కేంద్ర కమిటీ పత్రిక ప్రకటన నవంబెర్ 2018  

1.మార్క్స్ ఎంగెల్స్ ల రచనల సంక్షిప్త పరిచయం  

2.మార్క్స్ ఎంగెల్స్ ల రచనల సంక్షిప్త పరిచయం  

3.Chapter Part 2 Google Corrections done 15.02.21 8:30 AM  

4.Emergence of Modern Industrial works class  

5. Workers in Iron and Steel Factories  

6.Workers in Jute Factories  

7. డేవిడ్ హర్యే : పెట్టుబడి ఏడూ ప్రాధమిక వైరుధ్యాలు – ఒక విశ్లేషణాత్మక పరిచయం

8.పెట్టుబడిదారి ఉత్పత్తి – శ్రమ దోపిడి – మార్కెట్ సంక్షోభం  

9.మార్క్స్ ఎంగెల్స్ ల రచనల సంక్షిప్త పరిచయం  

10.భారతదేశంలో భూస్వామ్య విధానం ఉందా ?   

11.Economic & Philosophic Manuscripts of 1844 – 81 Pages

12.Need a serious research to Fight dogmas – 110 Pages

పుస్తకాలు

1.From Marx to MaoTSE Tung

2.Baba Bujho Singh AN untold story

 3.The Making of Varavara Rao

4.అనురాధ గాంధీ భారతదేశం లో కుల సమస్య

5.భారత ఆర్ధిక వ్యవస్థ 1857 – 2017

సుబ్రమణ్యం దంపతులను కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.  పత్రికా సమావేశం లో డీసీపీ మంచిర్యాల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ బెల్లంపల్లి రహెమాన్ పాల్గొన్నారు.

Also Read: అప్రూవల్ లేకుండా పాస్ పుస్తకాల జారీ

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles