భగవద్గీత – 41
పొలంలో మనం విత్తనాలు నాటతాం! అవి కొంతకాలానికి మొలకెత్తి మొగ్గతొడిగి, పుష్పించి ఫలిస్తాయి. మనం ఏ విత్తనం చల్లితే ఆ పంటే పండుతుంది. ఆ పంట పండి మన చేతికి రావటానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు పొలాన్ని కాపుకాయాలి, పక్షులనుండి, పురుగులనుండి, ప్రకృతి వైపరీత్యాలనుండి పంటను రక్షించుకోవాలి. అప్పుడే పంట చేతికి వస్తుంది.
మనిషి శరీరం.. పొలం(క్షేత్రం) అనుకొందాము.
మరి విత్తనాలు? అతని ఆలోచనలు, సంకల్పాలు, భావనలు.
మరి పొలం గురించి తెలిసి కాపు కాసేవాడు ఎవరు?
Also read: చేతిలో జపమాల, మనసులో మధుబాల!
ఇంకెవరు పరమాత్మే. ఆయనే క్షేత్రజ్ఞుడు. ఆయనే ‘‘కాపు’’. మనం ఏ ఆలోచనలను నాటుతామో అవి మొలకెత్తి మొక్కయి, మానయి పుష్పించి ఫలిస్తుంది.
Our yesterday’s thoughts decide our ‘today’!
Our today’s thoughts decide our tomorrow!
నిన్నటి మన సంకల్పమే నేటి మన వర్తమానం. నేటి ఆలోచన రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని వివేకానందుడు అన్నది ఇందుకే.
మంచి ఆలోచనలు మన భవిష్యత్తును అద్భుతంగా వుంచితే, పనికిరాని ఆలోచనలు మనిషిని పనికిరాని వాడిగా చేస్తాయి. అంటే వ్యక్తి, ఆలోచనలు అనే ఇటుకలచేత నిర్మింపబడ్డాడు అన్నమాట.
Also read: నేటి రమణమహర్షి ఎవరు?
మంచి ఆలోచనలు పెంచుకోవడమే మంచి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. మనసులో ఎప్పుడూ దిగులు పడుతూ నాకేమవుతుందో, ఏమయినా రోగమొస్తే, రొష్టు వస్తే అని ఆలోచిస్తే నిజంగా రోగాలు వస్తాయి. వాటిని Psycho Somatic disorders అని అంటారు. నూటికి తొంభయి తొమ్మిది రోగాలివే అన్నది అక్షర సత్యం.
దీనికి తోడు insurance company వారు, నీ కేమన్నా అయితే? నీవు పోతే? అని లేని పోని ఆలోచనలు రేకెత్తించి మనసులో అనుమానాలు నాటి psychosomatic disorders కి కారణమవుతున్నారు.
వారి వ్యాపార ప్రాధమికసూత్రం ’’నీకేమన్నా అయితే!‘‘ (Insurance మిత్రులు మన్నింతురు గాక!). మనదేశంలో ఇన్యూరెన్స్ ఏజంట్ వస్తున్నాడంటేచాలు ఒక 30 ఏళ్ల క్రితం పారిపొయ్యేవారు. అసలు ఉమ్మడి కుటుంబాలను మించిన ఇన్స్యూరెన్స్ ఉన్నదా?
కుటుంబ వ్యవస్థను పాడుచేసుకొని జీవితచరమాంకంలో ఒంటరిగా. తోడు ఉన్నంతవరకు ఫరవాలేదు.
భార్యాభర్తలలో ఒకరు పోయిన తరువాత బ్రతుకు దుర్భరమై భూమిమీదే నరకం చూస్తున్న నరులెందరో.
Also read: అణుబాంబు రూపంలో మృత్యువు
స్వాతంత్య్రానంతరం ఆధునిక జీవనాన్ని నిర్మిస్తున్నామనే భ్రమలో ఎన్నో ఆలోచనలు మన మెదళ్ళలో నాటారు కొందరు.
దాని ఫలితం కుటంబపు కోటగోడలు బీటలు వారటం మొదలుపెట్టాయి. కుటుంబం గురించి మన ఆలోచనలలో ఒక మార్పు తీసుకువచ్చారు.
వేల సంవత్సరాల నుండి మనలో లేని ఆలోచన ఆధునికత ముసుగులో ఆక్రమించి అంతా నాశనం చేసింది. సైంధవసంతను తయారు చేసేసింది. (సైంధవుడికి వావివరుసలు లేవు! చెల్లెలు వరుస అయిన ద్రౌపదిని వాంఛించిన ధూర్తుడు వీడు)
Paradigm shift… అలా రానే వచ్చింది.
ఇవ్వాల్టి మన బ్రతుకు, నిన్నటి మన ఆలోచన.
మన ఆలోచనల ప్రవాహాన్ని దారి మళ్ళించాం.
సంకల్పాల గొప్పతనాన్ని కించపరిచాం.
రాసులకొద్దీ ధనమున్నా
ఏబ్రాసి బ్రతుకే కదా!
డబ్బు సంపాదనే అంతిమ లక్ష్యం అని ఆలోచనలు నాటించుకొని మనకు ఉన్న పిల్లలను సుదూరతీరాలకు పంపి జీవనసంధ్య ఉస్సురంటూ వెళ్ళతీసే సంప్రదాయానికి తెరతీశాము.
ఇప్పుడు అనుభవిస్తున్నామ్…
Thanks to I.C.T.. Information and communication technology. ఆధునిక సమాచార జగత్తు కనీసం virtual families అయినా నిర్మించింది.
భగవద్గీతలో క్షేత్ర-క్షేత్రజ్ఞవిభాగము క్షేత్రము గురించి దాని వికారాలను గురించి, క్షేత్రజ్ఞుడి గురించి సవివరంగా తెలియచేస్తుంది.
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విధః
Also read: రాముడు ఎందుకు దేముడు?