ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మరి ని ఎదుర్కొంటున్నామనే ప్రపంచ దేశాల నాయకుల హామీల మధ్య నూతన సంవత్సరం లోకి అడుగుపెట్టాం! అంతా మ్యానిపులేషన్! అబద్ధాల వంతెనల మీద బ్రతుకు పోరాటం చేస్తున్నాం…వ్యాక్సిన్ మాట దేవుడెరుగు… ముక్కుకు – మూతికి మాస్కు, పక్కోడికి షేక్ హాండ్ ఇవ్వాలంటే భయం, ఎవడి నోట్లో ఎన్ని క్రీములు రాజ్యమేలుతూన్నాయో తెలియదు…అవి చైనా వా బ్రిటన్ వా అన్న సంశయం! ఇన్ని శక్తుల మధ్య రోగనిరోధక శక్తి ఉన్న వాడు బ్రతికి బట్ట కడుతున్నారు.. లేని వాడికి ఫొటోకు దండ వేసి దండం పెడుతున్నాం…అంతా మిధ్య! ఎవరు ఎంత కాలం ఉంటామో తెలియని సందిగ్ధం లో కాలం మారింది!…ట్రంప్ మళ్ళీ వస్తే చైనా పై యుద్ధం వచ్చినట్టే అని ఒకరు, బైడెన్ రావడం వల్లే భారతీయులు ఉద్యోగాలు ఉన్నాయని మరొకడు…ఎన్ని చెప్పినా జరిగేది జరుగుతూనే ఉంటుంది! పీవీ నరసింహారావు గారి మాటలో చెప్పాలంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది! అలాగే కాలం ఎవరి కోసం ఆగదు!క్యాలెండర్ లో డేట్లు మారుతూనే ఉంటాయి… కొత్త ఏడాదులు పుట్టుకు వస్తూనే ఉంటాయి! కొత్తగా డిసెంబర్ 31 న రాత్రి మందేసి చిందేసినంత మాత్రన కొత్త ఆలోచనలు, కొత్త ఆర్థిక పరిపుష్టి వస్తుంది అనుకోవడం భ్రమ! అదొక మానసిక ఆనందం తప్ప మరొకటి కాదు! డబ్బులు ఉన్న వాడికి రోజు పండుగే…లేని వాడికి ఏ న్యూ ఇయర్ వచ్చినా ఫలితం శూన్యం! ఒకరంటారు న్యూ ఇయర్ మనకేందుకు సంబరం అని… మరోకరు తెలుగు ఉగాది అసలైన పండుగ అని ఇలా ఎవరికి ఇష్టమైన రోజు వారు జరుపుకొంటే నష్టమేమీ లేదు! కొత్త బట్టలు వేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటే తప్పేమి లేదు! కానీ ఒకరి మనో భావాలు ఒకరు విమర్శించు కోవడం…కత్తులు కుత్తుకుల మీద పెట్టుకోవడం వల్ల వైషమ్యాలు పెరిగి ప్రశాంత వాతావరణం కాస్తా నిప్పుల కుంపటి అయిపోతుంది! దీన్ని మ్యానిపులేషన్ థియరీ అంటారు! ఉన్నది లేని దానిగా సృష్టించడం! కరోనా లక్షణాలు ఏమిటీ అని డాక్టర్ ను అడిగితే సవాలక్షగా చెప్పారు…అందులో పాజిటివ్ అప్పుడే వస్తుంది… తెల్లారి నెగిటివ్… ఇలా ఏదీ కరోనా లక్షణమో కాదో తెలియక ఆసుపత్రిలో చేరితే బిల్లు చూసి ఇంటికి రాకుండానే వల్ల కాటికి వెళ్లిన వారున్నారు అంటే మ్యానిపులేషన్ కాక మరేమిటీ? ఇలా అడుగడుగునా మోసం దగా మధ్య బ్రతుకు బండిని లాగుతున్నాము.
ఇది చదవండి: నవోదయం, శుభోదయం !
ప్రతి జంతువు.. పక్షులు చివరి వరకు బ్రతుకు పోరాటం చేస్తాయి…జింక వెంటాడుతున్న పులి నుండి తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేసి ఒకొక్కసారి ప్రాణాలు రక్షించుకుటుంది…కానీ మనిషి మాత్రం పరువు లేదా భయం తో ప్రాణాలు తీసుకుంటాడు…తప్పు చేసి పోలీసోళ్లు తంతాడని ఒకడు, పరువు పోయింది ప్రాణం ఎందుకు అని మరొకడు…ప్రేమించిన పిల్లవాడు, పిల్ల దొరకలేదని, తండ్రి తల్లి కోప్పడ్డారని…వంట్లో సుస్తీ చేసింది ఇక బ్రతకను అని లేదా , వైవాహిక అపశృతులతో ప్రాణాలు తీసుకుంటున్న వారి కోసం కాలం ఆగదు! వాళ్లే చరిత్ర హీనులు అవుతారు! పోయినోళ్లు అంతా మంచోళ్ళు, ఉన్న వారు పోయినోళ్ళ తీపి గుర్తులు అని ఆత్రేయ సాహిత్యాన్ని పాడుకోవాలి! అంతే గానీ పోయిన వాళ్ల వెంట మనం పోతే ప్రపంచ జనాభా ఇంత ఉండేది కాదు! ఒకప్పుడు ప్రింట్ మీడియా డిసెంబర్ 30,31 ప్రత్యేక పేజీలు వేసేవి! ఈ సంవత్సరం శుభ అశుభ ఘటనలు గా అవి ఉండేవి! కాలం మారింది! ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లో 31 తేదీ గొప్ప సంఘటనలు బొమ్మలు తింపుతున్నారు! బెల్ బాటమ్ ప్యాంట్లు, హిప్పీలు, తలమీద చిన్న వెంట్రుకలు, అమ్మాయిలకు లాంగ్ హెయిర్ లు పొన్నీ టైల్ లు ఎన్నో ఫాషన్లు వస్తూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి! కాలం కదలాడే సన్నీ వేశాలను ఎన్నో చూసింది! అందులో మనం మనం చూసింది గోరంత! ఈ జనరేషన్ కు మన నీతులు పట్టవు…మనకు మన తండ్రులు తాతలు చెప్పిన నీతులు కూడా… ఆ కాలంలో పాత చింతకాయ పచ్చడిలా తోచేవి! ఇప్పుడు మనం చెప్పే సుభాషితలు వారికి అంతే!!
పరస్పర అపనమ్మకాలపై లోకం లోని ప్రజలు పయనిస్తున్నారు… నమ్మకం అనేది నిజం లేకపోవడమే అని జీర్ణించుకొని బ్రతుకుతున్నారు…అబద్ధాల కాలం లో అన్నీ భ్రమ గా కనిపిస్తుంటాయి…అన్నీ బంధాల్లో ఆభద్రత భావం రాజ్యమేలుతుంది. కానీ సహజీవనం తప్పదు…కాలం మారింది అని సరిపెట్టుకొని రాజీ పడి బ్రతకాలి! “ఇంతే ఈ జీవితం చివరికి అంతా శూన్యం” అని అమరదీపం లో కృష్ణం రాజు లాగా పాడుకోవాలి!! లేదా “అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం” అంటూ అక్కినేని ఆశా జీవి లా బ్రతకాలి!!ఇదే జీవితం!!130 ఏండ్ల కిందట మహాకవి గురజాడ ‘దేశమంటే మట్టికాదోయి, దేశమంటే మనుషులోయి..’ అన్నాడు. ‘ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగు పడునోయి’ అని ఆయన ప్రశ్నించాడు. ‘తిండి కలిగితే కండగలదోయి’ అంటూ ఆ మహాకవి తిండి, ఆరోగ్యం విలువను వివరించాడు. తెలంగాణ మహాకవి దాశరథి నిజాం పాలనలో ఓ రోజు మానుకోట అడవుల్లో పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకొని పరుగెత్తవలసి వచ్చింది. ఆ రోజు ఆయన పరుగెత్తకుంటే ప్రాణం దక్కకపోయేది. ఆయన బతికి పోరాడాలనుకున్నారు. ఈ సంఘటన అనంతరం దాశరథి మహాకవి హైదరాబాద్‌లోని ఓ మిత్రుడికి లేఖరాసి అందులో ఒక ప్రసిద్ధ ఆంగ్ల కవి వాక్యా న్ని కోట్ చేశారు. ఆ వాక్యం ‘I adore life, I abhor death..’. ‘నేను జీవితాన్ని ఆరాధిస్తాను-మరణా న్ని ధిక్కరిస్తాను’ అని ప్రకటించాడు.
ఇది చదవండి:గడ్డు ఏడాది గడిచిపోయింది