అతను ఒంటరిగా కూర్చున్నాడు. నాలుగు గోడల మధ్యన. నాలుగు గోడలకి నాలుగు క్యాలెండర్లు తగిలించి ఉన్నాయి.
అన్నింటి లో ఒకటే తేది
20.11.2020
తరువాత ఎవరూ క్యాలెండర్ మార్చలేదు. మార్చే వాళ్ళు లేరు. మార్చే అవసరం లేదని అతను భావించాడు.
సూర్యోదయం,అస్తమయం,రాత్రి ఇవే అతనికి తెలుస్తాయి. ఎవరైనా పెడితే తింటాడు. లేక పోతే లేదు. శూన్యం లోకి చూస్తుంటాడు. అతనికి తెలిసినవి వెలుతురు,చీకటి
అంతే…
20.11.2020 న ఏమి జరిగింది ?
అతని ఏకైక కొడుకు అతన్ని వదలి విదేశాలకు వెళ్ళి పోయాడు. తిరిగీరాలేదు.
అతని కాలం ఆగిపోయిందక్కడే.
-వీరేశ్వర రావు మూల ©
Also read: అంతర్వాహిని
Also read: విలువలు
Also read: సెన్సేషన్ నాగా
Also read: యత్ర నార్యస్తు లభతే,రమంతే తత్ర రాక్షసాః
Also read: ఫీ ని క్స్