భగవద్గీత – 55
ఒక బ్రహ్మండమైన అగ్ని ప్రమాదాన్ని మీరు ఎప్పుడైనా TVలలో చూసిఉంటే గుర్తు తెచ్చుకోండి. అగ్నిభట్టారకుడు తన నాలుకలు చాస్తూ, అదేనండీ పెద్దపెద్ద అగ్ని జ్వాలలు (మంటలు) ఎంతో పెద్ద వస్తువులను, ఇళ్ళను మనం మామూలుగా చూయింగ్ గమ్ నమిలినంత తేలికగా చప్పరించి క్షణాలలో భస్మీపటలం చేసి సమూలంగా నేలమట్టం చేసి, భూమిమీద బూడిద కుప్పలను మాత్రమే మిగులుస్తాడు కదా!
Also read: విశ్వరూప సందర్శనం
అంతా క్షణకాలంలో జరుగుతుంది. అగ్ని నాలుకలు సాచి చప్పరించివేస్తూ ఉంటుంది. ఇంకొక ఊహ చెయ్యండి. ఒక్కసారి మీరు చిన్నప్పుడు ఎప్పుడో చూసిన మీకు బాగా తెలిసిన ఒక ఊరుకు వెళ్లి చూడండి. అప్పుడు మీరు చూసిన ఇళ్ళు, మీ తీపిజ్ఞాపకాలు ఏవీ మీరు ఒకప్పుడు చూసినట్లుగా ఉండవు. అన్నీ మారిపోయి ఉంటాయి కదా! కాలము అనే పురుషుడు కూడా అగ్నిలాగే అన్నీ అలా తన కోరలతో భక్షించి వేస్తాడు.
మన తల్లితండ్రులు ఉండరు, మన ఇష్టమైన చిన్నప్పుడు ఆడుకున్న ప్రదేశాలు ఉండవు, మన ఇష్ట సఖులు ఉండరు, అంతా మారిపోతూ ఉంటుంది. ఇదే కాలమహిమ. దీనినే భగవానుడు…
Also read: మోహం తొలగించుకోవడం ఎలా?
కాలోస్మిలోకః క్షయ కృత్ ప్రవృద్ధో అని అన్నారు…. లోకాలను తుదముట్టించుటకై పుట్టిన మహాకాలుడను నేను అని కదా ఆయన అన్నారు… మనం 29, 30 శ్లోకాలలో చూశాం.
లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమ్రగాన్ వదనైర్జలద్భిః
తేజోభిరాపూర్య జగత్సమ్రగం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్టో
అంటే ప్రజ్వలించుచున్న నీ ముఖముతో సమస్తమును నాకివేయుచూ చప్పరించుచున్నావు … ఇదీ కాల స్వరూపము…
ఇలా ఉంటుందని భగవానుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపుతూ అవగాహన కలుగచేశాడు..
Also read: నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది