ఆమె ముఖం నిండు చంద్రుడు అట,
కళ్ళు అరవిందాలు, చెక్కిళ్ళు గులాబీలు.
పెదవులు దొండపండ్లు,
పిరుదులు ఇసుక తిన్నెలు… అట.
అకటా, అది ఎప్పటి మాట!
మూడు దశాబ్దాల గతం
కాల శైలం క్రింద నలిగిపోయింది.
అప్పుడు కట్టిన కంద పద్యాలు,
పాడిన గజల్సు, ఇప్పుడు గుర్తు లేవు,
గుర్తు రావు కూడా.
ఇప్పుడామె పిరుదులు గాలి తిత్తులు,
అధరాలు ఘాటైన శొంటి కొమ్ములు,
చెక్కిళ్ళ చెక్క ముక్కలు,
కళ్ళు బడబాగ్ని గుండాలు, ముఖం సినీవాలి.
అతని గొంతు పెగలదు అంతగా ఇప్పుడు.
గుండెలోనే గుడు గుడు మని గొణుగు తాడు.
ఆమె కళ్ళెర్ర జేసినపుడు దేవ్యపరాధ స్తోత్రం
నోరు చేసుకున్నప్పుడు ఆంజనేయ దండకం.
Also read: మందల
Also read: లోహ(క)పు బిందె
Also read: ఇల్లు
Also read: జ్ఞాపకాలు
Also read: ఆమె