కేసీఆర్‌తో రాకేష్ తికాయత్ భేటీ
ఢీల్లీ: ప్రముఖ రైతు నేత, రైతు ఉద్యమ కారుడు, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ సింఘ్ తికాయత్ గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ నివాసంలో లంచ్ ఆతిథ్యాన్ని సుబ్రమణియన్, రాకేశ్ తికాయత్ ఇరువురు నేతలు స్వీకరించారు. తికాయత్‌తో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌తో ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని తికాయత్ తెలిపారు. తాను నాన్ పాలిటిక్స్ కి సంబంధించిన వ్యక్తినని ఆయన స్పష్టం చేశారు. రైతుల కోసం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. దేశంలో ఒకే వ్యవసాయ పాలసీ ఉంటే బాగుంటుందని తికాయత్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఆందోళనల్లో మృతిచెందిన రైతు కుటుంబాల వివరాలను మార్చి 10లోగా సీఎం కేసీఆర్‌కి అందిస్తామని తికాయత్ తెలిపారు. తెలంగాణలో రైతులకు ఎకరాకు పదివేలు ఇచ్చే రైతుబంధు పథకం బాగుందన్నారు. వచ్చే ఏడాది హైదరాబాదులో కిసాన్ సమ్మేళన్ ఏర్పాటు చేస్తున్నామని తికాయత్ ప్రకటించారు.