కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు వినడానికి ఆసక్తిగా ఉన్నా ఆచరణలో తీవ్ర ప్రభావం చూపబోతాయని, వ్యవసాయరంగ సామాజిక బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకోవడమే వీటి అంతరార్థంగా ఉందని రాయలసీమ సాంస్కృతిక వేదిక (రాసాంవే) అభిప్రాయపడింది. వ్యవసాయ రంగాన్నికార్పొరేట్ సంస్థల పరం చేయడమే ఈ మూడు చట్టాల ప్రధాన ఉద్దేశమని ఆరోపించింది. వ్యవసాయ రంగంపై అన్ని అంశాలు ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగాలని, స్వామినాథన్, జయతీ ఘోష్ సిఫారసులను, ఇంకా పలు అధ్యయనాలను పరిగణలోకి తీసుకొని ఉన్న చట్టాలనే మరింత బలోపేతం చేయాల్సింది పోయి ప్రమాదకర చట్టాలను తెచ్చిందని వేదిక విమర్శించింది.
Also Read:రైతుల బతుకుల్లో రాజకీయ బడబాగ్ని
తమ కనీస అవసరాలు తీర్చాలన్నదే రైతుల విన్నపం తప్ప ఇలాంటి చట్టాలు కావాలని వారు ఎప్పుడైనా కోరారా? మరి అలాంటప్పుడు ఎవరి లబ్ధి కోసం ఈ చట్టాలు? అని నిలదీసింది. అసలు సమస్యను పట్టించుకోకుండా ఇలాంటి చట్టాలు తేవడం సరైన పరిష్కారం కాదని, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వ్యవసాయ రంగ బాధ్యతల నుండి ప్రభుత్వ తప్పుకోవడం దారి తప్పడమే అవుతుందని వేదిక వ్యాఖ్యానించింది.
కొంతమొత్తం చెల్లించి రైతులతో ఒప్పందం చేసుకునే పద్ధతిలోనే ఐదేళ్ల లాభాలలో కూడా వారికి కొంత మొత్తం వాటాగా ఇవ్వాలని ఎందుకు పేర్కొనలేదని రాసంవే వేదిక ప్రశ్నించింది. ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలు నిత్యావసర వస్తువుల సవరణ ఆర్డినెన్స్, రైతు ఉత్పాదనల వ్యాపార, వాణిజ్య ఆర్డినెన్స్, ధరలపై రైతుల ఒప్పందం, వ్యవసాయ సేవా ఆర్డినెన్స్ లను ఈ సంస్థ విశ్లేషించింది.
Also Read: రైతు వ్యతిరేక బిల్లే కాదు, ప్రజా వ్యతిరేక బిల్లు అని ఎందుకు అనకూడదు?
కష్టనష్టాలు రైతువే:
రైతుల ఉత్పాదనలు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే మాట విశాలంగా అనిపించినా వాటిని అమ్ముకునే క్రమంలో ఎదురయ్యే కష్టనష్టాలకు ప్రభుత్వ బాధ్యత ఉండదు. ప్రస్తుతం పంటకు గిట్టుబాటు ధరలేకపోతే తాను చెల్లిస్తున్న కనీస మద్దతు ధరను ఇక మీద ఇవ్వదు. కార్పోరేట్ సంస్థలు ఆయా రాష్ట్రాల అవసరాలతో పని లేకుండా జొరబడి ఉత్పాదనలు కొనే హక్కును కల్పిస్తుంది.
Also Read: వ్యవసాయ చట్టాలు – రైతులు
Also Read:రైతు చట్టాలకు రాజకీయ రంగు: కిషన్ రెడ్డి
బాధ్యతల నుంచి పలాయనం:
వ్యవసాయరంగ సామాజిక బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకోవడమే ఈ చట్టాల అంతరార్థంగా ఉంది. ఆయా సంస్థలు రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వాటి నిబంధనల మేరకు వ్యవసాయం చేయడం అంటే రుణాలు, సబ్సిడీలు, బీమా లాంటి బాధ్యతను ప్రభుత్వం పక్కనపెట్టినట్లే. రైతులు అలా ఒకసారి ఒప్పందం కుదుర్చుకున్నారంటే ఇక ఆ చట్రం నుంచి బయటపడలేక చివరికి భూములు కోల్పోయేస్థితి కూడా దాపురించవచ్చు. కార్పొరేట్ సంస్థలు ఇష్టానుసారం రసాయనాలు వాడి భూములను కొన్ళేళ్లలోనే ఎందుకు పనికిరాని స్థితికి తీసుకురావచ్చు.