అదిగో అది దేవ భూమి
ఈ చివర దేవుడి స్వంత భూమి
రాముడు, కృష్ణుడు, బుద్ధుడు ఇక్కడే పుట్టారు
ధర్మరాజు, హరిశ్చంద్రుడు మనవాళ్ళే
దమయంతి చెంతకు దూతగా వెళ్ళిన నలుడు
దుర్యోధనుడికి కురుక్షేత్ర ముహూర్తం పెట్టిన సహదేవుడు
రావణుడి దగ్గర రాజనీతి నేర్చుకున్న లక్ష్మణుడు
అందరూ మన బంధువులే
మనం మహాత్ముడి మనవళ్ళం మొన్నటిదాకా.
మనం ధర్మదీక్షాపరులైనవారి వారసులం కాదిప్పుడు
తరగని అజ్ఞానంతో విజ్ఞానం వెంట పరుగెడుతున్నాం
నాడు వినాయకుడు గ్రంధస్థం చేసిన దానిని వదలి
నేడు నాయకుల వెంట నడుస్తున్నాం
మన మంచికోరే ‘అన్న‘లనే భావిస్తున్నాం
వారు నేర్పిన కుల రాజకీయమే నేడు మన మార్గం
వారు పాటించే కుటిల నీతే మనకు ఆదర్శం
వారుమార్చే పార్టీలే మన చొక్కాలు.
వారు సిద్ధాంతాలకు నీళ్ళు వదిలేశారు
అదే మనకు దిశా నిర్దేశం అనేశారు
మనం కట్టే పన్నుల్లో వారు కొంత మింగి
మరికొంత వారి పేదలకు పంచేయగా
మిగిలిన అడుగు బొడుగు జనానికి మహా ప్రసాదం
ఇదే నేటి భారతీయం.
ఇదే రేపటి విలయం.
Also read: ఫ్రపంచం
Also read: విజ్ఞానం – జ్ఞానం
Also read: స్నేహం
Also read: అనిత్య సత్యం
Also read: విద్యాలయం