నీకు తెలియని విషయముంది
తెలిసినా ఏమి చెయ్యలేని విషాదముంది !
నీకు తెలుసా
నాణానికి మూడో వైపుంటుందని
అవకాశ వాదమే అసలు వాదమని
మిగలినదంతా నిర్వేదమని
నీ ధనమే మమ్మల్ని నడిపే
ఇంధనమని ,
నీ రోగ లక్షణాలని బట్టి కాక
నీ బ్యాంక్ నిధులతోనే మా
చికిత్స కొనసాగుతుందనీ
నీ దేహం దహనానికి రవాణా
కాక ముందే
నీ ధనం మా ఖాతా లోకి చేరిపోతుంది
“క్లిక్” లతో “యాంటి బయోటిక్‘ లు
నీకు చేరినా
ఏ కణం తేడా చేసినా
మాకు మాత్రం ధన నిక్వణాలే !
పరిశోధనలేవో సాగుతుంటాయి
కార్పోరేట్ల కి కార్పెట్లు పరిచే
నేతలున్నంత కాలం
మా మందులమ్మే వాళ్ళంతా
కామందులవుతారు
ఆ వైద్యం మంచిదా
ఈ వైద్యం మంచిదా
మీమాంశ లో
మృత్యు మృదంగమాగదు !
నీ ఆరోగ్య తృష్ణ మా వైద్య
మృగతృష్ణ నీళ్ళ తో
ఎప్పటికీ తీరదు !
Also read: గీటురాయి
Also read: నిర్వికార సాక్షి
Also read: దేవుడా రక్షించు నా దేశాన్ని!
Also read: నగరం
Also read: ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
Also read: మిత్రమా ఇక యుద్ధం అనివార్యమే !
న్యాయానికి అన్నివైపులా అన్యాయమే!! చాలా బాగుంది నీ కవిత!!
అద్భుతమైన కవిత