Sunday, December 22, 2024

ప్రభుత్వరంగంలో బొగ్గును కాపాడుకుంటేనే భవిష్యత్తు

ప్రభుత్వరంగంలో బొగ్గు ఉత్పత్తిని కాపాడుకుంటేనే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. దేశంలోని పదకొండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న బొగ్గబావుల్లో కోల్ ఇండియా, ఇటు సింగరేణి బొగ్గు బావుల్లో ప్రభుత్వరంగ నాయకత్వం కొనసాగుతోంది. కోల్ ఇండియాలో ప్రస్తుతం నాలుగు వందల ముప్పై గనులు ఉన్నాయి. ఇందులో భూగర్భ గనులు రెండు వందల ఇరవై ఏడు ఉండగా, మిగిలిన గనులు ఇరవై ఎనమిది ఉన్నాయి. నూట డెబ్బై ఐదు వరకు ఓపెన్ కాస్టు గనులున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో నలబై ఐదు బొగ్గుబావులున్నాయి. ఇందులో ఇరవై ఆరు భూగర్భ గనులు, పంతొమ్మిది ఓపెన్‌కాస్టు గనులు ఉన్నాయి. పంతొమ్మిది వందల టొంబై ఒకటి నుంచి నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు

ఊపందుకున్న ప్రైవేటీకరణ

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అమలులోకి రావడంతో ప్రైవేటీకరణ ఊపందుకున్నది. ఇటీవల ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వం బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణను బిడ్డింగ్ ద్వారా ప్రారంభించడం జరగింది. నలభై ఒక్క గనులకు బిడ్డింగ్ జరగగా ముప్పై ఎనమిది బొగ్గు బ్లాకులకు సంబంధించి ఈ నెల పదకొండున బిడ్లను పరిశీలించారు. దీని తర్వాత మరో నాలుగు వందలకు పైగా కొత్త బొగ్గు బ్లాకులను వేలం వేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని చింతలపూడి సమీపంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఐతే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం బొగ్గుగనుల తవ్వకానికి సిద్ధంగా లేనట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ఇరవై వేల మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు అంచనా ఉంది. ఇందులో పది వేల ఐదు వందల మిలియన్ టన్నుల నిక్షేపాలను గుర్తించడం జరిగింది. ఒక్క తెలంగాణలోనే ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా నూట యాబై సంవత్సరాలు తవ్వినా తరగని బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక బొగ్గు నిక్షేపాలు అమెరికా దేశంలో ఉన్నాయి. సుమారు రెండు వందల యాబై బిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నట్లు గుర్తించారు.

ధర్మల్ కేంద్రాలు బంద్

ఐతే ఇక్కడ బొగ్గు తవ్వకాలు కాలుష్యం కారణంగా ప్యారిస్ లో జరిగిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు అనంతరం బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే ఐదు వందలకు పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలను బందు చేశారు. అలాగే చాలా వరకు బొగ్గు బావులను మూసి వేసి  హైడల్, సోలార్, విండ్ తదితర ప్రత్యామ్నాయాలతో విద్యుత్ ఉత్పత్తికి వెళ్తున్నారు. ప్రపంచంలో చాలా దేశాలలో రెండు వేల యాబై నాటికి యాబై శాతం వరకైన బొగ్గు ఉత్పత్తిని నిలిపి వేయాలని, రెండు వేల ముప్పైలో దీని ఫలితాలు కనిపిం చాలని, బొగ్గు ఉత్పత్తి చేసే ఇరవై ఎనమిది దేశాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తిలో చైనా మెదటి స్థానంలో ఉంది. రెండు వేల పంతొమ్మిదిలో మూడున్నర వేల మిలియన్ టన్నులకు పైగా చైనా బొగ్గు ఉత్పతి చేసింది. మరోవైపు కోలిండియా రెండు వేల ఇరవై మూడు నాటికి ఒక బిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నది.

కోల్ ఇండియా, సింగరేణి ప్రభుత్వరంగంలోనే కొనసాగాలి

ఇందు కోసం కొత్త బొగ్గు బావుల తవ్వకానికి యాబై వేల కోట్లకు పైబడి పెట్టుబడి అంచనాను వేసుకోవడం జరగింది. సింగరేణి కూడా రెండు వేల ఇరవై ఐదు నాటికి వంద మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని భావిస్తోంది. ఐతే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త బొగ్గు బ్లాకులను ఇటు కోల్ ఇండియాకు, సింగరేణికి ఉచితంగా, ఉదారంగా కేటాయిస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. సింగరేణీని కోల్ ఇండియాను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని పోరాటం చేస్తున్న జాతీయ కార్మిక సంఘాలు, ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ కార్మిక సంఘాలు, ఆయా ప్రాంతాల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఇందుకు చిత్తశుద్ధితో, పట్టుదలతో కృషి చేయాల్సి ఉంది.

చిన్నచిన్న విషయాలపై సమాయాన్ని వృధా చేయకుండా ప్రభుత్వ రంగంలోని బొగ్గు సంస్థలను కాపాడుకునే దిశన దేశ వ్యాప్తంగా సమరశీల పోరాటాలను రూపొందించాల్సిన అవసరం కార్మిక సంఘాలకు ఉన్నది.

బొగ్గు బావుల్లో మూడున్నర లక్షమంది ఉద్యోగులు

ప్రజా ప్రతినిధులు కూడా కేవలం ఎన్నికల సమయాలలో అమలుకు నోచుకోని, అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేయడం చేతగాని ఇన్ కం ట్యాక్స్ మాఫీ లాంటి హామీలు ఇచ్చి తమను తాము మోసం చేసుకోకుండా పట్టుదలగా కృషి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం రంగం లో ఇటు సింగరేణి, అటు కోల్ ఇండియా కొనసాగితే తప్ప ఉపాధి అవకాశాలు కూడా మెరుగు పడవు. అటు జార్ఖండ్ లాంటి రాష్ట్రంలో ఎనభై నాలుగు బిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఒరిస్సాలో ఎనబై, చత్తీస్ లో అరవై, పశ్చిమ బెంగాల్ లో ముప్పై రెండు, మధ్య ప్రదేశ్ లో ముప్పై బిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. ఎనబై శాతానికి పైగ థర్మల్ విధ్యుత్ కేంద్రాలకు ఆయా రాష్ట్రాల నుంచి సరఫరా చేస్తున్న దాఖళాలున్నాయి. బొగ్గుబావుల్లో దేశవ్యాప్తంగా మూడున్నర లక్షల మందికి పైగా కార్మికులు, అధికారులు ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తూ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు.

కార్మిక సంఘాలు ఏకం కావాలి

కార్మిక సంఘాలు కూడా వారి మధ్యన ఎన్నో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికి బొగ్గు సంస్థలను కా పాడుకునే విషయానికి వచ్చినప్పుడు మేమంతా ఒక్కటే అనే విధంగా ఉండడం వల్లా ప్రభుత్వరంగం నుంచి బొగ్గు సంస్థలను కేంద్ర ప్రభుత్వం లాగేసుకుని ప్రైవేటీకరించడానికి దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు విఫలం అమవుతున్నాయని చెప్పవచ్చు. మరింత పకడ్బందీగా బొగ్గు సంస్థలు ఉన్నటువంటి రాష్ట్రాలలో నిరుద్యోగులకు ఉపాధి కేంద్రాలుగా దశాబ్దాలుగా కొనసాగుతున్న సంస్థలను కాపాడుకోవడానికి మరింత గట్టి ప్రయత్నాలను, ఉద్యమాలను, పోరాటాలను చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంటులో ఆయా రాష్ట్రాల శాసనసభలలో ఇందుకు సబంధించి కోల్ బోల్ట్ ప్రాంతాల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో భవిష్యత్తు తరాలు చరిత్ర క్షమించదు. వాటి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడకుండా ఇందుకు సబంధించి ఐక్య పోరాటలు, ఐక్య ఉద్యమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది.

బొగ్గు రాష్ట్రాల యువతపై గురుతర బాధ్యత

ఆయా రాష్ట్రాల యువతీ యువకులపై కూడా ఈ భాద్యత ఉందన్న విషయాన్ని విస్మరించరాదు. ప్రభుత్వరంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలను శాంతియుత పోరాటాల ద్వారా ఒక పవిత్రమైనా ప్రార్థనలా ముందుకు తీసుకువెల్లాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఎవరూ కూడా విస్మరించరాదు. బొగ్గుబావులను ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పజెప్పుతున్న నేపథ్యం తిరిగి మనల్ని బానిస సమాజం వైపునకు తీసుకువెళ్తుందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రైవేటీకరణను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వరంగాన్ని మన గుండెల్లో కాపాడు కోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగాలు సజీవంగా ఉంటేనే జీవించే హక్కు సజీవంగా ఉంటుందనడంలో ఏమాత్రం అనుమానం లేదు.

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles