- పెద్దపల్లి జిల్లా గుంజపడుగులో ఘటన
- నిందితుల కోసం ప్రత్యేక బృందాలు
పెద్దపల్లి జిల్లా గుంజపడుగు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో బుధవారం (మార్చి 24) రాత్రి చోరీ జరిగింది. భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. బ్యాంకు మేనేజర్ ప్రహ్లాద్ పింగవా పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులుదర్యాప్తు చేపట్టారు. దొంగలు బ్యాంక్ వెనుక భాగంలో గల కిటికీని తొలగించి లోపలికి ప్రవేశించారు. మొదట స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లకముందే అలారం మోగకుండా ఉండేందుకు బ్యాటరీ కనెక్షన్ తొలగించారు. దొంగల కదలికలు పసిగట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరాల కనెక్షన్ కూడా తీసివేసి సీసీ టీవీ డీవీఆర్ ను కూడా తీసుకెళ్లారు. స్ట్రాంగ్ రూమ్ లోకి ప్రవేశించిన దుండగులు లాకర్ ని గ్యాస్ కటర్ తో కట్ చేసి అందులోని ఆరు కిలోల బంగారం, 18 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు.
నిందితులను పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలు:
బ్యాంకు దొంగతనానికి పాల్పడిన గ్యాంగ్ ణఉ పట్టుకోడానికి బ్యాంకు సెక్యూరిటీ వింగ్ వారి సహాయం తో రామగుండం కమిషనర్ 8 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. చోరీకి పాల్పడినవారు వేలి ముద్రలు కూడా దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీపీ సత్యనారాయణ తెలిపారు. సంఘటన స్థలాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ, ఓఎస్డీ శరత్ పవార్, డిసీపీ రవీందర్, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ ఉమేందర్, ఏసీపీ జైపూర్ నరేందర్ తో పాటు పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఇదీ చదవండి: రుణభారంతో రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్య