- అవాస్తవాలు ప్రచారం చేయొద్దు
- కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో దాని కట్టడికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కేసులు పెరుగుతుండటంతో థియేటర్లను మళ్లీ మూసివేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూసివేస్తారని సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారంపై సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
థియేటర్ల మూసివేతపై అసత్య ప్రచారం:
థియేటర్ల మూసివేతపై వస్తున్నవనీ అవాస్తవాలనేని, అలాంటి పుకార్లను నమ్మవద్దన్నారు. థియేటర్ల మూసివేతపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే తెలుగు చలన చిత్రపరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లింది. ఇండస్ట్రీనే నమ్ముకున్న ఎంతోమంది చిన్న నటీనటులు, కార్మికులు రోడ్డునపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోన్న తరుణంలో రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూసివేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. కొవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూ సినిమాహాళ్లు కొనసాగుతాయని అన్నారు. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయవద్దని తలసాని ట్విటర్ లో తెలిపారు.
Also Read: ఉచిత మంచినీరు అందేదెన్నడు