ప్రేయసీ!
పోతూ పోతూ నీవు నాచుట్టూ
వెదజల్లిన శూన్యం
చిక్కనై, ఉక్కిరిబిక్కి చేసి,
ఊపిరి సలపనివ్వక
నన్ను ఎప్పుడో ఒక రాయిగా మార్చేసింది.
ఎందుకో కొందరు నన్ను
సాలిగ్రామం అంటుంటే తడిమి చూసుకున్నా…
నా గుండెపై వ్యక్తావ్యక్తం గా
గజిబిజి రూపాలతో చెక్కినట్లు కనుపిస్తున్న
నీవుచేసిన మాసిపోని ప్రేమగాయాలు!
Also read: పగిలిన గాజు పెంకు
Also read: జగన్నాథ రథచక్రాలు
Also read: నేను చెప్పని కతలు
Also read: నా ఇష్టాయిష్టాలు
Also read: మా రైతు