- వైట్ హౌస్ పేరు పెట్టింది రూజ్ వెల్ట్
- మంటల్లో తగులబడింది, వరదల్లో మునిగింది
- ప్రపంచానికి నాడీకేంద్రం ఇదే
- రెండు వందల ఏళ్ళకు పైబడిన ఘన చరిత్ర
- ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు
అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బైడెన్ అమెరికా 46 వ అధ్యక్షుడు. శ్వేత సౌధం అంటే ఇంగ్లీష్ భాషలో వైట్ హౌస్. ఇందులో బైడెన్ ఈ నెల 20 తేదీ బుధవారంనాడు అడుగు పెట్ట బోతున్నారు. అత్యున్నత అమెరికా అంతర్గత వ్యవహారాలతో పాటు, ప్రపంచ దేశాల అత్యున్నత రాజకీయాలకు ప్రత్యక్ష సాక్షి అయిన ఈ సౌధం అత్యున్నత అధినేత నివాస అధికార గృహం కూడా. ఈ శ్వేత సౌధం నిర్మించి 210 ఏళ్ళు అవుతోంది. ప్రెసిడెంట్ ప్యాలెస్ గా, ఎగ్జిక్యూటివ్ మాన్షన్ అని పిలిచే ఈ ప్యాలెస్ గతంలో మంటల్లో దగ్ధమైంది, వరదల్లో మునిగిపోయింది కూడా. దీని మరమ్మత్తులు అప్పటి అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్ భవనం అంతా 1901 తెల్లటి కోటింగ్ వేయించడం వల్ల వైట్ హౌస్ అనే పేరు వచ్చింది! ఆరు అంతస్తులు గల ఈ భవనం పద్దెనమిది ఎకరాల్లో ఉంది. లోపల నిర్మాణ స్థలం 55,000 చదరపు అడుగులు. 1792 లో దీన్ని నిర్మాణం ప్రారంభం అయింది.
ఐర్లండ్ వాస్తుశిల్పి జేమ్స్ హోబన్ పర్యవేక్షణ
ఈ నివాసాన్ని ఐర్లండ్ లో జన్మించిన వాస్తుశిల్పి జేమ్స్ హోబన్ నియోక్లాసికల్ శైలిలో రూపొందించారు. హోబన్ డబ్లిన్లోని లీన్స్టర్ హౌస్ పై ఉన్న భవనాన్ని నమూనాగా చేసుకున్నాడు. ఈ భవనం ఐరిష్ శాసనసభ అయిన ఓరెచ్టాస్ పోలి ఉంది. 1792-1800 మధ్యకాలంలో ఆక్వియా క్రీక్ ఇసుకరాయి తెలుపు రంగును ఉపయోగించి నిర్మాణం జరిగింది. 1801 లో థామస్ జెఫెర్సన్ మొదట వైట్ హౌస్ లోకి వచ్చాడట. అతను ఆర్కిటెక్ట్ బెంజమిన్ హెన్రీ లాట్రోబ్‌తో కలిసి అత్యాధునిక సొగసులు దిద్దారు.
ఇది చదవండి: అమెరికా రక్షణ వ్యవస్థ ఇంత బలహీనంగా ఉందా?
వాషింగ్టన్ నగరాన్ని తగులపెట్టిన బ్రిటిష్ సైన్యం
1812 యుద్ధంలో భాగంగా 1814 లో వాషింగ్టన్ పట్టణాన్నీ దహనం చేసే ప్రయత్నంలో బ్రిటిష్ సైన్యం ఈ భవనానికి నిప్పంటించింది. లోపలి భాగాన్ని పూర్తిగా నాశనం చేసింది. వెలుపలి భాగాన్ని కూడా చాలా మేరకు ధ్వంసం చేసింది. అయితే, ప్రెసిడెంట్ భవనం పునర్నిర్మాణం వెంటనే ప్రారంభమైంది, అధ్యక్షుడు జేమ్స్ మన్రో అక్టోబర్ 1817 లో పాక్షికంగా పునర్నిర్మించిన ఎగ్జిక్యూటివ్ నివాసంలోకి వెళ్లారు. 1824 లో సెమీ సర్క్యులర్ సౌత్ పోర్టికో, 1829 లో నార్త్ పోర్టికోలను చేర్చడంతో బాహ్య నిర్మాణం అందంగా ముస్తాబు అయింది. 1948 వరకు అమెరికా అధ్యక్షులు గా అనిచేసిన వారు వైట్ హౌస్ నిర్మాణాలను పెంచుకుంటూ పోయారు.
జార్జి వాషింగ్టన్ ప్రారంభిస్తే జాన్ ఆడమ్స్ ముగించారు
అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ 1792 లో స్థల సేకరణ చేసి నిర్మాణం మొదలు పెడితే 1800 సంవత్సరం రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ హయాంలో పూర్తయింది. అప్పట్లో ఈ భవన నిర్మాణానికి రూ. 13 కోట్లు (మన కరెన్సీ ప్రకారం) అయిందట. వైట్ హౌస్ లో 132 గదులు, 142 తలుపులు, 147 కిటికీలు ఉన్నాయి. 5.700 మంది ఉద్యోగులు ఈ భవన పర్యవేక్షణ చూస్తారు. వైట్ హౌస్ లో రాజ్యాంగంలోని ఆర్టికల్ II, సెక్షన్ 2 లో స్థాపించబడిన కేబినెట్ పాత్ర, ప్రతి సభ్యుడి సంబంధిత కార్యాలయం ఉంటాయి. వారి విధులకు సంబంధించి ప్రెసిడెంట్ కు అవసరమయ్యే ఏదైనా అంశంపై సలహా ఇవ్వడంతో పాటు అమెరికా లోని యాభై రాష్ట్రాల పర్యవేక్షణ కూడా ఈ భవనం నుంచే కొనసాగుతుంది.
ఇది చదవండి: పుట్టింటిలోనే ప్రజాస్వామ్య అపహాస్యం
సకల శాఖల ప్రతినిధుల కార్యాలయాలు
కొత్త అధ్యక్షుడు బైడెన్ కేబినెట్‌లో ఉపాధ్యక్షురాలు కమల హ్యారీస్ మరియు 15 కార్యనిర్వాహక విభాగాల అధిపతుల కోసం అత్యాధునిక కార్యాలయాలు ఉంటాయి. దేశ విదేశీ నిపుణులు, ఇతర బ్యూరోక్రాట్ ల విభాగాలు, వ్యవసాయ, వాణిజ్య, రక్షణ, విద్య, ఇంధనం, ఆరోగ్యం, మానవ సేవలు, హోంల్యాండ్ సెక్యూరిటీ, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, ఇంటీరియర్, లేబర్, రాష్ట్ర, రవాణా, ఖజానా మరియు అనుభవజ్ఞుల వ్యవహారాలు మరియు అటార్నీ జనరల్. అదనంగా, కేబినెట్‌లో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మరియు ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం, స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లు వైట్ హౌస్ లో ఉన్నాయి.
రోజుకు 6 వేలమంది సందర్శకులు
వాషింగ్టన్ డీసీ పెన్సిల్వేనియా లో ఉన్న ఈ భవనం సందర్శకుల అనుమతులు కూడా ఉండేవి. ఉగ్రవాదుల బెడద లేని కాలంలో రోజూ ఆరు వేల మంది ఈ భవనాన్ని సందర్శించే వారు. ప్రపంచంలోని దాదాపు 232 దేశాల అధ్యక్షులతో మాట్లాడే విధంగా అధ్యక్షుడికి వైట్ హౌస్ లో నెట్ వర్క్ ఉంది. దేశ విదేశీ ప్రతినిధుల తో ఒకేసారి 142 మందితో విందు ఆరగించే పెద్ద డైనింగ్ టేబులు , ఆహ్లద కరంగా ఆదుకోవడానికి వివిధ క్రీడా కోర్టులు, అధ్యక్షుడు విశ్రాంతి భవనం తో పాటు ఆపద సమయంలో అధ్యక్షునికి హాని జరగకుండా అంతర్గత భూగృహ సముదాయం అత్యవసర ద్వారాలు, అమెరికా రక్షణ స్థావరం ముఖ్యులకు సలహాలు- భద్రత పై నేరుగా మాట్లాడే ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. అంటే పెంటగాన్ వైట్ హౌస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ భూగృహం నుండి ఉన్నాయట. ఆలాగే అత్యవసరంగా, గుట్టుచప్పుడు కాకుండా అధ్యక్షుడిని తరలించే రహస్య మార్గాలు కూడా వైట్ హౌస్ లో ఉన్నాయట.
ఇది చదవండి: అధికార బదిలీకి ముందు అమెరికా పరువు తీసిన ట్రంప్
భారత సంతతివారికి పెద్దపీట
ఇంత గొప్ప చరిత్ర గలశ్వేత సౌధంలో 17 మంది ఇండో-అమెరికన్లకు బైడెన్ స్థానం కల్పించారు. ఇప్పటి వరకు ఏ అమెరికా అధ్యక్షుడు ఇవ్వనంత గౌరవము ఇప్పుడు ఇండో అమెరికన్లకు దక్కింది. బుధవారంనాడు వైట్ హౌస్ లోకి ప్రవేశించినున్న బైడెన్ నాలుగేళ్ళ పాటు అధ్యక్ష బాధ్యతల్లో ఉంటారు..అయితే శ్వేత సౌధంలో బరాక్ ఒబామా కుడిభుజంగా ఉపాధ్యక్షుడిగా ఎనిమిదేళ్ళపాటు పనిచేసిన అపారమైన అనుభవం బైడెన్ కు ఇంతకు ముందే ఉంది!