వెన్నెల వాగులో తడిసేవారెందరో
ప్రేమ పొంగితే నీళ్ళు చల్లే వారెందరో
చందమామకే ఓ కూతురుంటే
శశిబాల తన పేరైతే
కలువ కన్యలే తన చెలులయితే
నేనేగా ప్రేమ స్వరూపుడిని
కిరణ సామ్రాట్టుకి ప్రియ పుత్రుడిని.
కలల రాణి కావాలనుకో లేదు
నీ సహచర్యాన్ని కోరుకున్నాను
నీ ప్రేమను కళాత్మకంగా
పాటల్లో అందిస్తావు
ఆనందంగా అందుకున్నా
నా మూగ ప్రేమకు
మాధ్యమం లేదు
ఆరాధన నిండిన నా కళ్ళే
నీకు అందిస్తాయి అనంత రాగాలు
నువ్వు అందుకున్నా లోకాచారాలు
కుటుంబాలు అడ్డు నిలుస్తాయి
నిర్మల భావావేశాలకు
సంస్కృతి, సంస్కారాలు
దాటరాని దాటలేని అడ్డంకులై
విడదీస్తాయి కలసిన మనసుల్ని
జీవితాలు కలుపుకోలేని అభాగ్యుల్ని.
Also read: “అద్దరి – ఇద్దరి”
Also read: “బాల్యం”
Also read: ఓంకారం
Also read: ‘‘వరం’’