- 20 డివిజన్ల పరిథిలోని 160 మండలాల్లో ఎన్నికలు
- మూడ్రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ
మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమయింది. నామినేషన్ల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎన్నికల సంఘం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. నేటి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఉదయం 10.30 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్ లు వార్డు మెంబర్ల ఎన్నికలకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లలో 160 మండలాల్లో మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి.
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం పాలకొండ రెవెన్యూ డివిజన్ల పరిథిలోని 9 మండలాల్లో, విజయనగరం జిల్లాలోని విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిథిలోని 9 మండలాల్లో, విశాఖపట్నం జిల్లాలోని పాడేరు రెవెన్యూ డివిజన్ లోని 11 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
Also Read: పంచాయతీ వ్యవస్థలో మహిళా సాధికారిత పేరుకే! పురుషులదే పెత్తనం!
తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, ఎటపాక రెవెన్యూ డివిజన్ పరిథిలోని 11 మండలాల్లో, పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, ఏలూరు, కక్కునూరు రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాలు, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం రెవెన్యూడివిజన్ పరిథిలోని 12 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు జిల్లాలోని గురజాల రెవెన్యూ డివిజన్ లోని 9 మండలాల్లో, ప్రకాశం జిల్లాలోని కందుకూరు రెవెన్యూ డివిజన్ లోని 15 మండలాల్లో, నెల్లూరు జిల్లాలోని గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్ పరిథిలోని 15 మండలాల్లో మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: గ్రామాల్లో పట్టుకోసం పార్టీల ఫీట్లు
రాయలసీమలొని కర్నూలు జిల్లాలో ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిథిలోని 14 మండలాల్లో, అనంతపురం జిల్లాలోని అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిథిలో 19 మండలాల్లో కడప జిల్లాలోని రాజంపేట, కడప రెవెన్యూ డివిజన్లలోని 11 మండలాల్లో, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిథిలో 14 మండలాల్లో మూడో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 9న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు.