Thursday, November 21, 2024

కలలో టూకీగా నా కథ

My Confession

                        ————————-

                                              By Leo Tolstoy

                                              ————————

                         నా సంజాయిషీ

                         ———————

                                                లియో టాల్స్టాయ్

                                                ————————–

తెలుగు అనువాదం:

డా. సి. బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

                             ఉపసంహారం

                             ——————

                ఈ ముందు విషయాలన్నీ నేను మూడు సంవత్సరాల క్రితం రాసినవి. ఇవి ముద్రింపబడతాయి.

                ఇప్పుడు కొన్ని రోజుల క్రితం నేను మరలా తిరిగి పరిశీలించేటప్పుడు — ఆ రోజుల్లో నా ఆలోచనా విధానం, నా అనుభూతులు జ్ఞప్తికి చేసుకునేటప్పుడు — నాకు ఒక కల వచ్చింది. నేను అనుభవించినదీ, ఇంకా నేను ముందు పేజీల్లో వివరించినదీ — అంతా కలిపి సంక్షిప్త రూపంలో ఈ కల వ్యక్తపరిచింది. అందుచేత, నన్ను అర్థం చేసుకున్న వారికి ఈ కల — ఇంతకుముందు వివరంగా చెప్పినదంతా , విశదీకరించి, ఏకీకృతం చేస్తుందని అనుకుంటున్నాను. ఇదే ఆ కల :

                నేను ఒక మంచం మీద పడుకొని ఉండడం నేను చూశాను. నాకు సౌకర్యంగానూ లేదు, అసౌకర్యంగానూ లేదు: నేను వెల్లకిలా పడుకొని ఉన్నాను. అప్పటిదాకా తట్టని ప్రశ్న — నేను దేని మీద , ఎట్లా పడుకున్నానో అనేది- ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాను. నా పడకను పరిశీలనగా చూశాను. అన్ని పక్కలా కలపబడిన, అల్లిన గట్టి తాళ్ల ఆధారం మీద నేను పడుకుని ఉన్నట్లు చూశాను: అలాంటి ఒక ఆధారంపై నా పాదాలు ఉన్నాయి, పిక్కలు ఇంకో దాని మీద ఉన్నాయి. కాళ్లు అసౌకర్యంగా అనిపించాయి. ఆ ఆధారాలు కదిలించవచ్చని నాకు అర్థమైంది. నా పాదం కలిపి, పాదం దగ్గర చివరగా ఉన్న ఆధారాన్ని తోసేసాను. అలా చేస్తే నాకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుందని అనిపించింది. నేను దాన్ని ఎక్కువ దూరం తోశాను. మళ్లీ దాన్ని నా పాదాలతో అందుకోవడానికి ప్రయత్నించాను. దాంతో నా పిక్కల కింద ఉన్న ఆధారం కూడా జారిపోయింది. ఫలితంగా నా కాళ్లు గాల్లో వేలాడాయి. నేను అలా చేయగలను అని నమ్మి నన్ను నేను సరి చేసుకుంటానికి, నా శరీరం మొత్తంతో ఒక కదలిక ఇచ్చాను; దానితో నా క్రింద ఉన్న మిగిలిన సపోర్టులు జారి చిక్కుపడ్డాయి. విషయం తప్పు పద్ధతిలో వెళుతుందని నాకు అనిపించింది: శరీరంలో క్రింద భాగం అంతా జారి క్రిందికి వేలాడుతోంది. అయినా పాదాలు భూమిని తాక లేదు. నా పై వెనుక భాగం మీదే ఆధారపడ్డాను.

Also read: పవిత్రగ్రంథాలలోనే సత్యం,అసత్యం  రెండూ కనిపిస్తాయి

              అది అసౌకర్యంగా ఉండటమే కాక, నాకు భయం కలిగించింది. అంతకు ముందు నాకు రాని ప్రశ్న అప్పుడు మాత్రమే కలిగింది. నేను ఎక్కడ ఉన్నాను? దేనిపై పండుకొని ఉన్నాను? నా చుట్టూ పరిసరాలు గమనించడం మొదలుపెట్టాను. మొదటిగా నేను ఎక్కడ పడిపోతాను అనుకుంటున్నానో అటు నా శరీరం వేలాడే దిశగా క్రిందకి చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.  నేను పెద్ద పర్వత శిఖరాలు, భవనాలతో  సమానమైన, ఊహించలేనంత ఎత్తులో ఉన్నాను.

                 ఏ అంతులేని అగాధంపై నేను వేలాడుతున్నానో, ఎందులోకి నేను లాగబడుతున్నానో — అందులో ఏమైనా ఉందో లేదో నేను గ్రహించలేకపోయాను. నా గుండె చిక్కబడింది. నేను భీతిల్లాను. అటు చూడటమే భయానకంగా ఉంది. అటు చూస్తే నేను చివరి ఆధారం నుండి జారిపోయి నశించి పోతాననే భావన కలిగింది. నేను చూడలేదు. కానీ చూడకపోవడం మరీ అధ్వానంగా ఉంది. ఎందుకంటే — చివరి ఆధారం నుండి కూడా పడిపోతే నాకు ఏమవుతుంది? అని ఆలోచన వచ్చింది. భయంతో చివరి సపోర్ట్ కూడా కోల్పోతున్నానని, నా శరీరం నెమ్మదిగా క్రింద క్రిందకు జారిపోతున్నదనే భావన కలిగింది. ఇంకో క్షణంలో నేను పడిపోతాను. అప్పుడు — ఇదంతా నిజం కాదు,  కల అని నాకు తోచింది. ‘ మేలుకో ! ‘– నన్ను నేను మేల్కొల్పడానికి ప్రయత్నించాను. కానీ అలా చేయలేకపోయాను. ‘ నేనేం చేయాలి? ఏం చేయాలి?’  నన్ను నేను ప్రశ్నించుకున్నాను. పైకి చూశాను. పైన కూడా అనంతమైన ఆకాశం ఉంది. నేను అపారమైన ఆకాశంలోకి చూశాను. కింద అగాధాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించాను. నిజంగా మర్చిపోయాను కూడా. క్రింది అనంతమైన అగాధం వికర్షకంగానూ,  భయానకంగానూ ఉంది; పై

అనంత ఆకాశం నన్ను ఆకర్షిస్తోంది, ధృడ పరుస్తోంది.నేనింకా అగాధం పైన జారిపోకుండా ఉన్న చివరి సపోర్ట్ లతో వేలాడుతూనే ఉన్నాను; నేను వేలాడుతున్నానని నాకు తెలుసు. అయినా గాని నేను పైకే చూస్తున్నాను. నా భయం పోతోంది. కలలో జరిగినట్లు ఓ స్వరం ఇలా చెబుతోంది: ” దీన్ని గమనించు: ఇంక ఇదే! “నేను నా పైన అనంత ఆకాశంలోకి ఇంకా, ఇంకా చూస్తున్నాను. చూసినకొద్దీ ప్రశాంతత వచ్చిన భావన కలుగుతోంది.

Also read: అన్ని మతాలలో ప్రలోభం

జరిగినదంతా నాకు గుర్తుంది. నేను కాళ్లు ఎలా కదిలించానో, ఎట్లా వేలాడానో, ఎంత భయపడ్డానో, ఇంకా పైకి చూస్తే  భయం నుండి ఎలా రక్షింపబడ్డానో — ఎలా జరిగిందో కూడా నాకు బాగా గుర్తుంది. నేను ఇలా అనుకున్నాను: నేను ఇంకా అలాగే వేలాడటం లేదా? నా మొత్తం శరీరానికి ఆధారమైన సపోర్టుని అనుభూతిస్తూ చుట్టూ చూడటం లేదు. వేలాడుతూ పడిపోకుండా గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. ఎట్లా పట్టుకోబడ్డాను అని అనుకున్నాను: నేను తడిమి చుట్టూ చూసుకున్నాను. నా శరీరం మధ్యభాగం కింద ఒక ఆధారం ఉంది. నేను పైకి చూసినప్పుడు — దానిమీద సురక్షితంగా ఉన్నాను. ఇంతకుముందు కూడా అదే నాకు సపోర్ట్ ఇచ్చింది.

అప్పుడు కలల్లో జరిగినట్లు నేను వేలాడిన విధానం ఊహించుకున్నాను. మెలకువగా ఉన్న వారికి అది అర్థవంతంగా లేకపోయినా, చాలా సహజమైన, గోచరమైన మరియు ఖచ్చితమైన విధానంగా అనిపించింది. నేను అంతకుముందు వెంటనే దాన్ని అర్థం చేసుకోలేకపోయినందుకు కలలోనే ఆశ్చర్యపడ్డాను. నా శిరస్సు దగ్గర ఒక స్తంభం ఉన్నట్లుగా అనిపించింది. ఆ సన్నటి స్తంభానికి ఆధారం ఏమీ లేకపోయినా, అది సురక్షితంగా ఉందనటంలో సందేహం లేదు. ఆ స్తంభం నుంచి చాలా నేర్పుగా చేయబడిన ఒక దారపు మడత వేలాడుతోంది. ఎవరైనా — నడుము మధ్యభాగం ఆ దారపు మడతలో ఉండేటట్లు  వేలాడుతూ, పైకి చూస్తే -పడిపోయే ప్రశ్నే లేదు. ఇదంతా నాకు స్పష్టంగా ఉంది. నేను ఆనందంగా,  ప్రశాంతంగా ఉన్నాను. ఎవరో నాతో ఇట్లా అన్నట్లు వినిపించింది.

            “నువ్వు దీన్ని జ్ఞప్తికి పెట్టుకో.”

  నాకు మెలకువ వచ్చింది.

Also read: బ్రతకడానికి విశ్వాసం అవసరం

                          (అయిపోయింది )

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles