బుడతలు చెంత చేరుటయె భోగము, పద్యము వల్లెవేయు సం
దడికి తరించుటే ప్రభుపదార్చన,
చీమిడి ముక్కుతో తడం
బడు నిరుపేద బిడ్డలకు పాఠము
నేర్పుటయే వ్రతమ్ము, దుం
దుడుకు తనాల బాలునకు దుస్తరమైన గణాంకసూత్రముల్
నుడువుటె కార్యసిద్ధి, నయనోత్పలముల్ వికసించి, భీతితో,
కడివెడు నీరు కార్చునెడ గ్రక్కున బెత్తము పారవైచి చూ
పెడు దయయే సజీవ నవవేదము మాబడి పంతులమ్మకున్!
(చిన్ననాటి నా పంతులమ్మ కీశే రంగనాయకమ్మగారిని మనసారా స్మరిస్తూ)
నివర్తి మోహన్ కుమార్