- బీసీ సంక్రాంతి సభలో సీఎం ఉద్వేగపూరిత ప్రసంగం
- సామాజిక న్యాయానికి బీసీల అభివృద్ధే నిదర్శనం
రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్లపై ఉందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ కార్పొరేషన్ ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన బీసీ సంక్రాంతి సభలో సీఎం ప్రసంగించారు. ప్రభుత్వానికి బీసీ సామాజిక వర్గాలకు కార్పొరేషన్ ఛైర్లన్లు సంధానకర్తలుగా వ్యవహరించాలని జగన్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా 18 నెలల్లో 90 శాతం హామీలను నెరవేర్చామని జగన్ తెలిపారు.
మహిళలకు పెద్ద పీట
రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు 728 మంది బీసీలకు తగురీతిలో వివిధ స్థానాలు కల్పించడం ద్వారా ఆయా సామాజిక వర్గాలను బలోపేతం చేశామని సీఎం తెలిపారు. కార్పొరేషన్ ఛైర్మన్ ఎంపికలో మహిళలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ప్రమాణస్వీకారం చేసిన 56 మంది ఛైర్మన్లలో 29 మంది మహిళలే కావడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించేందుకు కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని అన్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులు మాత్రమే లబ్ధిపొందారని జగన్ విమర్శించారు. పార్టీలకతీతంగా ఎలాంటి వివక్ష చూపకుండా అర్హులందరికీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు అందాలని జగన్ ఆకాంక్షించారు.
బీసీల సంక్షేమం కోసం కట్టబడ్డామన్న సీఎం
ఇదే వేదికపై 18 నెలల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశానని ఆ సమయంలో ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఏటా 10 వేల కోట్లు ఖర్చుచేస్తామని చెప్పి ఐదేళ్లలో 19 వేలకోట్లు మాత్రమే ఖర్చు చేసిందని సీఎం గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు బీసీ కార్పొరేషన్ల కోసం 38 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. డిసెంబరు 25 నుంచి ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: వైఎస్సార్ జగనన్న “శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం
టీడీపీపై విమర్శలు కురిపించిన సీఎం జగన్
బీసీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్న జగన్ కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60 శాతం పదవుతు ఇచ్చిన ఘనత వైసీపీదేనని అన్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారని అన్నారు. అత్యంత గౌరవప్రదమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని కూడా బీసీలకు కేటాయించిన ఘనత ఈ ప్రభుత్వానిదని సీఎం జగన్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం బీసీలకు చెందిన ఒక్క వ్యక్తిని కూడా రాజ్య సభకు పంపలేదని కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం నలుగుర్ని పంపితే వారిలో ఇద్దరు బీసీలు ఉన్నారని అన్నారు.
ఇదీ చదవండి:‘వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం’ ప్రారంభించిన సీఎం జగన్
Usually I never comment on blogs but your article is so convincing that I never stop myself to say something about it. You’re doing a great job Man, Keep it up.