ఎక్కడనుంచో వచ్చా
ఇక్కడ మజిలీ చేశా
కలివిడిగా ఉండే ప్రయత్నం చేస్తా
నా పని నిజాయితీగా చేస్తా
కపటం లేకుండా బతుకుతా
పధ్ధతిగా ఉండాలనుకుంటా
ఎందుకొచ్చానో తెలుసుకోవాలనుకుంటా
ఏం చెయ్యాలో చెప్పేశారు
ఎక్కడికి పోవాలో తెలియదు
ఎందుకు పోవాలో తెలియదు
పోగలనో లేదో తెలియదు
మజిలీ మజాగా ఉంటే చాలా?!
Also read: దేవదాసి
Also read: అభయం
Also read: వర్షం
Also read: రణం
Also read: నాగరికథ