Thursday, November 21, 2024

మేతావులు

మేధావులందరూ వలసపోయి

మేతావులంతా నేతలైతే

అనాదిగా వలస వస్తున్న మేతావులు పెరిగిపోయి

భారతం భరతం పట్టేస్తున్నారు.

మేరా భారత్ మహాన్అన్నాడొకడు

ఏం చెయ్యాలో తెలియని మేతావులు కడుపు మండి

అతన్ని అభిమన్యుణ్ణి చేయాలనుకున్నారు

అతను అర్జునుడుగా నిలవాలంటాడు భరతుడు

ఏం చేస్తాడో చూడాలి ఆ మహాదేవుడు.

Also read: ఆత్మ బలం

Also read: మహర్షి

Also read: కిం కర్తవ్యం?

Also read: రాగ సాయుజ్యం

Also read: కలి

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles