(‘THE HERMIT PROPHET’ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN)
తెలుగు సేత: డా. సి. బి. చంద్ర మోహన్
28. సంచారి తత్త్వాలు
————————–
ఒకానొకప్పుడు, ఒక సన్యాసి ప్రవక్త ఉండేవాడు. నెలలో మూడు సార్లు అతను ప్రక్క నున్న గొప్ప నగరానికి పోయి, అక్కడ విపణి వీధిలో, ‘ఇవ్వటం–పంచుకోవటం‘ గురించి అక్కడ ప్రజలకు బోధించేవాడు. అతడు అనర్గళంగా మాట్లాడగలిగేవాడు. ప్రజలలో చాలా కీర్తి సంపాదించుకున్నాడు.
ఒక సాయంత్రం ముగ్గురు మనుషులు అతని ఆశ్రమానికి వచ్చారు. ఆ ప్రవక్త వారిని పలకరించాడు. వారు ఇలా అన్నారు. ” నీవు ఇవ్వటం–పంచుకోవటం గురించి బోధిస్తున్నావు కదా. బాగా ఇవ్వగలిగిన వారు నిర్భాగ్యులకు ఇవ్వాలని కదా నీ కోరిక! నీ కీర్తి — నీకు బోలెడు సంపద సమకూర్చిందనడంలో మాకే సందేహమూ లేదు. ఇప్పుడు మాకు అవసరం కాబట్టి నీ సంపద మాకు పంచి ఇవ్వు!”
ఆ ప్రవక్త ఇలా జవాబిచ్చాడు” స్నేహితులారా! ఈ మంచం, చాప మరియు నీళ్ల కూజా తప్ప నా దగ్గరేమీ లేవు. మీకిష్టమైతే వీటిని మీరు తీసుకు పోవచ్చు. నా వద్ద వెండి, బంగారాలు ఏమీ లేవు.”
అప్పుడు వారు ప్రవక్తను తృణీకార భావంతో , చిన్న చూపు చూస్తూ ముఖం తిప్పుకున్నారు. వారిలో చివరిగా వెళ్లే వ్యక్తి ఒక క్షణం ద్వారం వద్ద నిలబడి ఇట్లా అన్నాడు. ” ఓ మోసకారీ! నువ్వే చేయని పనిని, చేయమని ఇతరులకు బోధిస్తున్నావు.”
Also read: బంగారు బెల్టు
Also read: దాతృత్వం
Also read: జాద్ మైదానము
Also read: నిండు చంద్రుడు
Also read: బోధన