————————-
( ‘THE RIVER ‘ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN )
తెలుగు అనువాదం:డా. సి. బి. చంద్ర మోహన్
45. సంచారి తత్త్వాలు
————
ఒక మహా నది ప్రవహించే కడిషా లోయలో రెండు పిల్ల కాలువలు కలిసి ఒకదానితో ఒకటి ఇలా మాట్లాడుకున్నాయి.
ఒక కాలువ అంది కదా!” మిత్రమా! నువ్వెలా వచ్చావు? నువ్వు వచ్చిన మార్గమెట్లా ఉంది?”
రెండో కాలువ ఇలా జవాబు చెప్పింది.” నా త్రోవ చాలా అడ్డ దిడ్డంగా ఉంది. మిల్లు చక్రం విరిగి పోయింది. తన మొక్కలకు నా ప్రవాహం నుంచి నీళ్లు పారించే పెద్ద రైతు చనిపోయాడు. ఏమీ చేయకుండా ఖాళీగా ఎండలో కూర్చొని, తమ సోమరితనాన్ని పెంచుకునే వారినుండి స్రవించే మురికితో నేను పోరాటం చేస్తూ ఉంటాను. సరే నీ మార్గం ఎలా ఉంది? సోదరా!”
మొదటి కాలువ ఇలా జవాబిచ్చింది. ” నాది వేరే మార్గం. సువాసన గొలిపే పూలతోనూ, తలలు దించుకున్న విల్లో చెట్ల తోనూ నిండిన త్రోవలో , నేను కొండలపైనుండి దిగి వచ్చాను. ఆడా, మగా — నా నీరు వెండి కప్పులతో త్రాగుతారు. చిన్న పిల్లలు తమ గులాబీ రంగు పాదాలతో, నా అంచులలో తెడ్లు వేసినట్లు ఆడతారు. నా గురించి అంతా సంతోషంగా, నవ్వుతూనే ఉంటారు. మధుర గీతాలు వినిపిస్తాయి. నీ మార్గం అంత ఆనంద దాయకం కానందుకు నాకు చాలా జాలిగా ఉంది.”
అదే సమయంలో నది పెద్ద గొంతుతో ఇలా అంది.” రండి, రండి, మనం సాగరంలోకి వెళుతున్నాం. రండి — రండి. మాట్లాడొద్దు! నాలో కలిస్తే మీ సంచారాలూ, సుఖ దుఃఖాలూ– అన్నీ మరిచి పోతారు! రండి — రండి! మన తల్లి ఐన సాగరం యొక్క హృదయాన్ని చేరుకున్నప్పుడు మీరు, నేను — మనం వచ్చిన త్రోవలన్నీ మరిచిపోతాం!”
Also read: ఆనందం
Also read: దేవుణ్ణి కనుగొనటం
Also read: డెభ్భై ఏళ్ళు
Also read: ప్రార్థన
Also read: నీడ