నన్ను పుట్టించింది మా అమ్మ నాన్న అంటే
కాదు అందరినీ దేవుడు సృష్టించాడు అన్నారు
సరే అనేంతలో వచ్చాడు డార్విన్
మనం కోతులనుండి పుట్టాం అన్నాడు
అవునా, నిజమా అనేంతలో
అటునించి ఐన్ స్టీన్
ఇటునుంచి రమణ మహర్షి
కేకలు పెట్టారు ‘నిన్ను నువ్వు తెలుసుకో‘ అని
విషయమేమిటని ఫ్రాయిడ్ని అడగబోతుంటే
శంకారాచార్యుడి అద్వైతం వినిపించింది
‘భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే‘ అన్నాడు ఆయన
మరి నేను మూఢుడిని కాదన్నాను
ఆలాగైతే నిర్గుణ బ్రహ్మ అన్నాడు
అర్థం కాలేదన్నాను
అయితే సగుణ బ్రహ్మ అన్నాడు
అంటే అన్నాను
వెధవా, మంచిగా బతికి చావు అనేశాడు
అర్థమైంది, పూర్తిగా అర్థమైంది.
Also read: వేరు
Also read: కవిత్వం
Also read: ద్వైతం
Also read: అహం-కారం
Also read: విభ-జనం