- పెద్దపల్లి గౌరెడ్డి పేట లోని ఎల్ఎన్ సీ బ్రిక్స్ లో ఘటన
- యజమాని దూషించడంతో వెళ్లిపోయామన్న బాధితులు
పెద్దపల్లి జిల్లా గౌరెడ్డి పేట లోని ఎల్ ఎన్ సీ బ్రిక్స్ లో గత మూడు నెలలుగా పని చేయడం జరుగుతుందని తేదీ 8.2.2021 సోమవారం రోజున ఎల్ ఎన్ సీ బ్రిక్స్ యజమాని రామిండ్ల భాస్కర్ ఫిర్యాదుదారుని అన్న వదిన పూజారి తారాబతి దుర్భాషలాడటంతో ఆ రోజు సాయంత్రం 4:00 గంటల నుండి ఎక్కడికి వెళ్లారో తెలియలేదని విక్రమ్ సాహు పెద్దపల్లి పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బృందాలుగా విడిపోయి వారిని వెతకడం జరిగింది. బాధితులు రాఘవపూర్ గ్రామంలో ఉన్నారని తెలిసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ తరలించి భార్యా భర్తలు ఇటుక బట్టీ నుండి వెళ్లిపోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. బాధితులరాలిని మహిళా పోలీసు అధికారి సమక్షంలో వీడియోగ్రఫీ రికార్డు చేస్తూ విచారణ జరపారు. ఎల్ ఎన్ సీ బ్రిక్స్ యజమాని రామిండ్ల భాస్కర్, గుమస్తా రమణయ్య లు దూషించడంతో పాటు కొట్టడంతో ఇటుక బట్టీ నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నించడం జరిగిందని తెలిపారు. తనపై ఎవరూ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడలేదని యజమాని కొట్టడంవల్లే పారిపోయినట్లు బాధితులు తెలిపారు. బాధితుల స్టేట్మెంట్ ప్రకారం ఎల్ ఎన్ సీ బ్రిక్స్ కంపెనీ యజమాని మరియు గుమస్తాల పై కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులైన భార్యభర్తలను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యజమాని మరియు గుమస్తా ల పై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి సిఐ ఏ.ప్రదీప్ కుమార్ స్పష్టం చేశారు.