నేను కాగితం, కలం తెచ్చాను
ఏదో రాయాలనే తపన
ఏం రాయాలో తెలియదు
ఎందుకు రాయాలో తెలియదు
ఎలా రాయాలో తెలియదు
ఎవరికోసం రాయాలో తెలియదు
అయినా మొదలై పోతుంది రాత
ఎవరు రాస్తున్నారో తెలియదు
నేను రాస్తున్నానని అనిపించదు
నాలోని నేను రాస్తున్నాడేమో
అందరిలో ఉండే నేను వాడేనా
అంతరాంతరాల్లోని అంతర్యామి వాడేనా
అన్నీ తెలిసిన వాడు వాడేనా
అందరికీ తెలిసినవాడు వాడేనా
ఏదైనా చేసేవాడు వాడేనా
అసలు వెలుగు వాడేనా
అంతా నాలోని వాడే అయితే
మరి నేను ప్రమిదనా
వట్టి ప్రమిదనా
మట్టి ప్రమిదనా
అయితే ఏం
ఆ పరంజ్యోతిని
దోసిట పట్టేది నేనేగా.
Also read: బంధం
Also read: అంతంలో అనంతం
Also read: 26/11
Also read: న్యాయం