చంద్రుడు వచ్చాడు రాత్రిలోకి
వెన్నెలలు కురిపిస్తున్నాడు
మండే గుండెల సెగలకు
ఆ వెన్నెలలు ఆవిరులైపోయాయి
అయినా కురిపిస్తూనే ఉన్నాడు వెన్నెల నిరాశతోనే
రాత్రి భారంగా గడచిపోతూంది.
రవి రాకుండా అరుణాన్ని పంపించాడు ఉషస్సుతో
ఆ తేజస్సులోకి జారిన లోకంలో రాజు మళ్ళీ పుట్టాడు
అది గమనించకుండా చంద్రుడు వెళ్ళిపోయాడు నిద్రలోకి.
మబ్బు తెరలను కప్పిన మంచు తెరలు విడిపోతున్నాయ్
మనసు పొరలను కప్పిన మబ్బు తెరలు విడిపోతున్నాయ్
ఉదయరాగం కనిపిస్తూంది
ముత్యాల సింగారించిన మల్లెమొగ్గ
పెదవులు విప్పి నవ్వేస్తూంది.
Also read: “వలస పక్షులు”
Also read: గోవిందా గోవింద
Also read: త్రిలింగ దేశంలో హత్య