నా అహం దెబ్బ తిన్నప్పుడల్లా
వంట్లో ఒక అగ్ని జ్వాల,
ఇంట్లో ఒక ఆహవమ్,
ఆమె చెక్కిళ్ళపై నాలుగు ఎర్రని వాతలు .
ఆ రోజు అంతే.
క్రోధం తో ఊగిపోతూ
డాబా మీదకు చేరి
వెల్లికిలా పడుకున్న.
ఎందుకో చందమామ నల్ల ముఖం వేసాడు
రెండు ఎర్రని భయంకరమైన కోరలు,
గారాపట్టిన పళ్ళు..
అగ్నిగోళాల్లాంటి కణకణ లాడే కళ్ళు
ఉలిక్కి పడ్డా!
పురాణాలలోనుండి ఊడిపడ్డ రాక్షసుడి లా
…ఏమైంది ఈ వేళ సుధాంశునికి?
ప్రొద్దున్నే మా ఆవిడ రహస్యం చెప్పింది…
“చంద్రుడు ఒక అద్దం అండీ!”
Also read: పగటి కలలు
Also read: భాష
Also read: సన్మానం
Also read: కత్తులు, కరవాలాలు
Also read: జీవన సంధ్య