- కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసిఆర్ ని కలిసి సమస్యను వివరించిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
- కౌటాల, కాగజ్ నగర్ మండలాలలో 132/33 kv సబ్ స్టేషన్ లతో పాటు విద్యుత్ ఫీడర్ మంజూరు
- 56 కోట్ల 56 లక్షలతో మంజూరైన నూతన విద్యుత్ సబ్ స్టెషన్ లు
- విద్యుత్ సబ్ స్టేషన్ ల మంజూరుతో తీరనున్న విద్యుత్ సమస్యలు
- తమ విన్నపంతో మంజూరు చేసిన సియం కేసీఆర్ కి సిర్పూర్ నియోజకవర్గం ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
మంచిర్యాల : సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల ఫీడర్ లో గల మండలాల్లో ఎన్నో ఏండ్లుగా లోవోల్టేజ్ సమస్యతో సతమతవుతున్న ప్రజలకూ, రైతులకూ ఇక ఆ సమస్య దూరం కానుంది.తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రి జగదీష్వర్ రెడ్డి కృషితో నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్టుదలతో కౌటాల మండలానికి 132/33 కేవీ సబ్ స్టేషన్ లతో పాటు విద్యుత్ ఫీడర్ మంజూరు చేశారు.
Also Read: బొగ్గు అక్రమ తవ్వకాలు, స్మగ్లింగ్
ఎన్నో ఏండ్లుగా మండల ప్రజలు లోవోల్టేజ్ సమస్యతో బాధపడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ గమనించిన స్థానిక శాసనసభ్యులు కోనేరు కోనప్ప కొద్ది రోజుల క్రితం క్షేత్రస్థాయిలో విద్యుత్ అధాకారులతో కలిసి పర్యటించి సమస్యను వివరించడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ని కలిసి సమస్యను వివరించారు.ముఖ్యమంత్రి మంత్రి చొరవతో ఈ రోజు సమస్యను దూరం చేయడమే లక్ష్యంగా విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు విద్యుత్ ఫీడర్లను మంజూరు చేశారు. విద్యుత్ సబ్ స్టేషన్ ల మంజూరుతో ఇక నియోజకవర్గంలో లోవోల్టేజ్ సమస్య దూరం కానుంది.
Also Read: రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలు
తమ విన్నపం మేరకు నియోజకవర్గంలో సబ్ స్టెషన్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీ, మంత్రి జగదీశ్వర్ రెడ్డికీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ధన్యవాదాలు తెలిపారు.