దశావతారాలతో
దివినుండి భువికి
దేవుడు దిగి వచ్చేది
దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు,
ధర్మం నిలపడానికేనని
అందరికీ తెలుసు.
అది జరగక పోతే
బడుగు, బలవంతుడికి
బలి అవుతాడనీ తెలుసు.
అధర్మం వల్ల కలిగే
అశాంతిని గుర్తించక
మన మనశ్శాంతి కోసం
చేతులు ముడుచుకుని ఉంటున్నాం.
కృష్ణుడు ధర్మం కోసం
యుద్ధం చేయమన్నది
మరిచి కృష్ణాష్టమి నాడు
ఉట్టి గట్టిగా కొడతాం.
దశరా, దీపావళి పండుగలు
చెడుపై మంచి యుద్ధం చేసి
గెలిచిన సంబరాలని గుర్తు లేదు
అయినా భక్తిగా పూజలు చేస్తాం
కళ్ల ముందు జరుగుతున్న చెడును
ఆపే, తగ్గించే భాద్యత మాత్రం తీసుకోం.
అందుకు ప్రభుత్వాన్ని తిడతాం.
ప్రభుత్వమంటే మనం కాదనుకుంటున్నాం.
పశువులకు చాలు తిండి, నిద్ర, రతి.
మనమూ అంతేనా!
మరే జీవికి లేని ఆలోచన
మనిషికి వ్యర్ధ వరమా!!
మనందరం సుఖంగా ఉండడం కోసం
ధర్మంగా బ్రతకడానికి
దేవుడు దిగి రావాలా!!!
మనది మనం కడుక్కోలేమా?
Also read: మోహం
Also read: “తపన”
Also read: “యుగాది”
Also read: “మునక”
Also read: ‘ఆ గురువు లెక్కడ’