జనాభా పెరిగిందంటూ జనావాసాలను విస్తరిస్తూ
అరణ్యాలను ఆక్రమిస్తున్న దెవరు
దానికి ఆమోదముద్ర వేస్తున్న దెవరు
ప్రాణ వాయువు అందించే చెట్లు లేకపోతే
ప్రాణులేవీ బ్రతకవని తెలిసినా
కూర్చున్న చెట్టును నరుక్కుంటున్న దెవరు
వాతావరణంలో కాలుష్యం పెరిగిందని
క్యాన్సర్లు వస్తాయని గోల పెడతాం
వాతావరణ కాలుష్యం లేకుండా చేసే
చెట్లను మాత్రం పెరగనివ్వం
చెట్లు లేనిదే వర్షాలు కురవవని తెలిసినా
ఇళ్లలో, వీధుల్లో కూడా చెట్లు కొట్టేసేది ఎవరు
వర్షాలు లేక పంటలు పండక రైతులు బతక లేక
ఆత్మహత్యలకు పాల్పడితే కారణం ఎవరు
అవి సమాజం చేస్తున్న హత్యలు కావా?
నదులు, కాలువలు అనేకం ఉన్న ప్రాంతాలలోనూ
రోడ్లు చెరువులు కూడా ఆక్రమించి
అడ్డగోలుగా భవనాలు కట్టేసి
వాన నీటికి దారి లేకుండా చేసి
ఊళ్ళను పట్టణాలను వరదలతో ముoచేది ఎవరు
ఆస్తులు, ప్రాణాలు పోయినా
దానికి కారకులు మన ఆఫీసర్లు
వాళ్ళతో ఆ పని చేయించే మనమేగా
అందుకే అన్నీ తెలిసినా ఊరుకుటున్నాం
ఎందుకంటే ఆ కష్టనష్టాలు అనుభవించేది, చచ్చేది పేదవాడేగాని మనం కాదుగా.
Also read: నా మాట
Also read: ‘‘అంతా మన మంచికేనా?’’
Also read: మహర్షి
Also read: “మహిళ”
Also read: “యుగ సామ్రాట్ గురజాడ”