Wednesday, December 25, 2024

ర్యాంకింగ్స్ లో కొహ్లీని అధిగమించిన రూట్

  • 5వ ర్యాంకుకు పడిపోయిన విరాట్
  • మూడో ర్యాంకులో జో రూట్

ఐసీసీ టెస్ట్ త్యాజా ర్యాంకింగ్స్ భారతజట్టుకు మాత్రమే కాదు…భారత క్రికెటర్లకు సైతం చేదుఅనుభవాన్ని మిగిల్చాయి. గత రెండు సంవత్సరాలుగా వ్యక్తిగత ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన విరాట్ కొహ్లీ వరుస వైఫల్యాలతో 5వ ర్యాంక్ కు పడిపోయాడు. మరోవైపు గత నాలుగు టెస్టుల్లో ఓ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు బాదటం ద్వారా  ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తన ర్యాంక్ ను గణనీయంగా మెరుగుపరచుకొన్నాడు. 2017 సెప్టెంబర్ తర్వాత తన కెరియర్ లో అత్యుత్తమంగా మూడో ర్యాంక్ నమోదు చేశాడు. చెన్నై వేదికగా ముగిసిన తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో రికార్డు డబుల్ సెంచరీ సాధించడం ద్వారా రూట్ తన ర్యాంకింగ్ పాయింట్లను 883కు పెంచుకొన్నాడు.

పాపం కొహ్లీ:

గత నవంబర్ లో చివరిసారిగా బంగ్లాదేశ్ తో ముగిసిన డే-నైట్ టెస్టులో శతకం బాదిన విరాట్ కొహ్లీ…ఆ తర్వాత నుంచి వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సాధించిన 72 పరుగులతో కలుపుకొని రెండంటే రెండు అర్థశతకాలు మాత్రమే సాధించాడు. స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోడం, పితృత్వపు సెలవు కారణంగా ఆస్ట్రేలియాతో చివరి మూడుటెస్టులకు దూరం కావడం కూడా కొహ్లీ ర్యాంక్ ను దారుణంగా దెబ్బతీసింది. నంబర్ వన్ ర్యాంక్ నుంచి 5వ ర్యాంక్ కు కొహ్లీ దిగజారిపోడం, భారతజట్టు ర్యాంక్ ను సైతం తీవ్రంగా ప్రభావితం చేసింది.

ప్రస్తుతం కొహ్లీ 852 ర్యాంకింగ్ పాయింట్లతో ఉన్నాడు. జో రూట్ మాత్రం కొహ్లీ కంటే 36 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ మాత్రం 919 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్లతో రెండో ర్యాంక్ లో ఉన్నాడు. 883 పాయింట్లతో జో రూట్ 3వ ర్యాంక్ లో నిలిచాడు. ఆస్ట్ర్రేలియా యువ ఆటగాడు మార్నుస్ లబుషేన్ 878 పాయింట్లతో నాలుగో ర్యాంక్ లో ఉన్నాడు.

Also Read: ఒక్క ఓటమితో తిరగబడిన భారత అదృష్టం

13వ ర్యాంక్ లో రిషభ్ పంత్ :

Image result for rishabh pant test

చెన్నై టెస్టు తొలిఇన్నింగ్స్ లో 91 పరుగులు సాధించడం ద్వారా భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ తన కెరియర్ లో తొలిసారిగా 700 ర్యాంకింగ్ పాయింట్లను  అందుకొన్నాడు. పంత్ 13వ ర్యాంక్ లో నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ స్వింగ్ కింగ్ జిమ్మీ యాండర్సన్ 6వ ర్యాంక్ నుంచి 3వ ర్యాంక్ కు చేరుకోగలిగాడు. స్టువర్ట్ బ్రాడ్ రెండో ర్యాంక్ లో నిలవగా కంగారూ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ 908 పాయింట్లతో టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు.

రెండోర్యాంక్ లో రవీంద్ర జడేజా :

ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ మొదటి మూడు స్థానాలలో బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, జేసన్ హోల్డర్ కొనసాగుతున్నారు. స్టోక్స్ 428, జడేజా 414, హోల్డర్ 410 పాయింట్లతో ఉన్నారు.

Also Read: టెస్టు క్రికెట్లో మరో ప్రపంచ రికార్డు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles