- జనవరి 11న హాజరుకావాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్ ఇటీవలే నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయింది. భూ కేటాయింపుల ఛార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు ఈ నెల విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ తో పాటు, విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ చంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
ఇది చదవండి: జగన్ ఫిర్యాదుపై జస్టిస్ రమణ స్పందన కోరిన సుప్రీం చీఫ్ జస్టిస్
జగన్ హాజరుపై డైలామా?
నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు నుంచి అరబిందో, హెటిరో భూ కేటాయింపులకు సంబంధించిన ఛార్జిషీట్ ఈడీ కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే జనవరి 11న నెల్లూరు జిల్లాలో ప్రారంభం కానున్న అమ్మఒడి రెండో విడత కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించాల్సి ఉంది. అదే రోజు కోర్టుకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీచేయడంతో అమ్మఒడి కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతారా లేదా ఆయన తరపు న్యాయవాదులు మినహాయింపు కోరతారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇది చదవండి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారం