Tuesday, November 5, 2024

వెన్నెలలు కురిసే చాలా మంచి రోజులివి

తిరుప్పావై -1

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్

మాడభూఫి శ్రీధర్

ఇది మార్గశీర్ష మాసం. సుసంపన్నమైన గోకులంలో పుట్టిన వారు అదృష్టవంతులు. ఆ గోపికలు సుశోభితులైనవారు. ఎంతో మంచి రోజు కదూ. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. మహావీరుడు యశోద కుమారుడు. శూరుడైన నందగోపుని నందనుడు, యశోద విశాల నేత్రి. ఇక ఆయన బాల సింహము. చల్లని వాడు నల్లని వాడు. మబ్బువలె మేఘమై, నీలిమేఘం కలిగిన వాడు, చంద్రునివలె ఆహ్లాదకరుడు. సూర్యునివలె తేజోమయుడు.  నారాయణునే నమ్మండి. నమస్కరించండి. ఇతరులెందుకు, ఆ స్వామి వ్రతానికి  కాలవసిన్నీ ఇస్తానంటున్నాడు. శ్రీకృష్ణుడు సిద్ధపడినాడు. మీరందరూ ఈ వ్రతం ఆచరించి లోకమంతా వెలిగిపోతూ ఉంటుంది. మంగళమైనవే ఇవన్నీ, మార్గళి స్నానము చేయడానకి రండి, శ్రీఘ్రముగ రండి అని గోపికలు వారి నాయకి శ్రీ గోదాదేవిని రమ్మంటున్నాడు.  గొల్ల కన్నియలందరను ఆహ్వానిస్తున్నాడు. ఈవ్రతంనికి ఇదే అనువైన సమయం, ఈ మాసము – మార్గశీర్షమాసం. కావలసింది భాగవత్ సంశ్లేషము. అది కోరుకునే భక్తులందరం వ్రతం కోసం మార్గళి స్నానానికి చేయండి అనివ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము – మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతం చేసి మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.

మాడభూషి శ్రీధర్ తెలుగు భావార్థ గీతిక

మార్గశీర్షపు వెన్నెలలోన తెల్లవారకమున్నె యముననీట

భక్తి భాగ్యాల మునిగితేల రారండు, వ్రేపల్లె పడుచులార

వేలాయుధమ్ముదాల్చి నందనందనుడదిగో నిలిచినాడు

వేయికన్నులార్పక కాచు వేలుపతడని తెలియరో కొమ్మలార

యశోద ఒడిలోని కొదమసింగము వాడు, కలువకన్నుల రేడు

కారుమబ్బుమేనివాడు, చంద్రసూర్య చలువకాంతుల జల్లువాడు

వరద వాత్సల్యగుణాభిరాముడు నారాయణుడు, నెల నోము పట్టి

కలిసి భజింతము రండు, పరై వరాల కలిమి కైవల్యమిచ్చునతడు

బాపురే వ్యాఖ్యారేఖ

గగనం నిండిన శ్రీకృష్ణ చరణాలు

ఇది తొలి పాశురానికి భావార్థ కళారేఖ.

శ్రీకృష్ణునిపాదాలే శరణు.

ఆ పాదాల చెంత ఉద్భవించిన

స్త్రీరూపంలో వచ్చిన యమున

కేశపాశాలే నది అని బాపు భావన.

గగనాలు దాటి నిండిపోయిన

త్రివిక్రముడని

మడమల దగ్గర

మేఘాలు చూపుతన్నాయి. 

కృష్ణుని కీర్తించడానికి వెళ్లవలిసిన

గోద సఖులే అలనాటి గోపికలనే భావం.

అన్నీ మరిచి గోపికలు

ఆనంద రాసలీలలో ఉన్నారు.

యమున నీరు,

మార్గళి స్నానం,

సిరిసంపదలిచ్చే జీవనది. శ్రీ కృష్ణుని ప్రేమకోసం

గోపబాలికలుగా మారిపోదాం

అని గోదమ్మ చెలికత్తెలకు నాయకత్వం

వహిస్తున్నరమణీయ చిత్రం ఇది.

నారాయణ మంత్రంతోనే

ఈ వ్రతం చేద్దాం అంటున్నారు

కనుకచిత్రానికి

అగ్రభాగాన పాదాలే విస్తరించాయి. 16.12.23

2. తిరుప్పావై 

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
శెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి,

మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్,
ఐయముమ్ పిచ్చైయు మాన్దనైయుమ్ కైకాట్టి,
ఉయ్యుమాఱెణ్ణి ఉగన్దేలో రెమ్బావాయ్

ఈ రెండో పాశురంలో వ్రతం చేయవలసిన పనులేమిటో వివరిస్తున్నారు గోదాదేవి. భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులం వారు. ముఖ్యంగా ఆచరించవలసిన పనులు ఇవి. శ్రీ మన్నారాయణుని పాదారవిందాలకు కీర్తిస్తామే ప్రధానమైన పని. శ్రీకృష్ణుడిని సంవిశ్లేషం చాలు. ఇంకేవీ అవసరం లేదు. ఇతరమైన భోగ్య విషయాలు ఆలోచించవు. పాలని అడగను, పాలను త్రాగం. కన్నుల కాటుక దిద్దుకోము. నేతి కావాలని అడగడం. సిగలో పూలను ముడుచుకోను. శాస్త్ర విరుద్దములైన పనులేవీ చేయబోను. ఒకరిపై మరొకరికి చాడీలను చెప్పము. అవసరంవైన వారికి, మంచి వారికే ఇస్తాం. సన్యాసులకును, బ్రహ్మచారులకును మంచి దానాలు చేస్తాం.  ఇంకా ఉజ్జీవించు మార్గములేవైన ఉంటే అవి ఏమిటో తెలుసుకుని సంతోషంగా ఇచ్చుకుంటాను. ఈ విధంగా ఈ ధనుర్మాస కాలమంతా కొనసాగిస్తాం. ఇదికదా కఠినమైన వ్రత నియమాలు.

ఈ పాశుకాల మాలికలో గోదాదేవి వ్రతం చేయవలసిన కొన్ని నియమాలను ఈ పాశురంలో వివరిస్తూ ఉన్నాయి. శ్రీ కృష్ణునికి అంకితంకావటమే ముఖ్యమైన నియమం. భక్తిలేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులూ, నియమాలూ అంటూ ఏమీలేవు. శ్రీ కృష్ణుని యందు ప్రీతితో యేది చేస్తే అవేనియమాలు అంటుంది గోద.

మాడభూషి శ్రీధర్ తెలుగు భావ గీతిక

వినుడు సౌభాగ్యసుదతులార, ఇది ఇడుముల బెట్టువ్రతముకాదు

పరమానందబ్రహ్మము చేర్చునోము నియమాలు తెలియరండి

పాలకడలి నాథుడి పాలు మనము, వేరు పాలు మనకేలమగువలార

కృష్ణయ్య నెయ్యము సాధింప నెయ్యి మానుదము పూబోడులార

తెల్లారి స్నానాలు కద్దు, పూలు కాటుకల సొబగులొద్దు

చేయరాని పనులు వద్దన్న చేయకుండుటె మేలు, చాడీలు,

మనసు నొప్పించు విరుపులొద్దు, హితవులు వినడమే మనకు మంచి

దానధర్మాలతో నడచి దామోదరుని చేరుటే మన తిరునోము దారి.

బాపురే వ్యాఖ్యారేఖ

పాలకడలి శయనుడు

పాలకడలిలో శేషశయ్యపై శయనించే

శ్రీ వైకుంఠనాథుడి

పాదాలనే వేడు కుంటున్నారా గోపికలు.

యమునాస్నానాలతో

తెల్లారి శుచులైనారు.

అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు.

చాడీలు, పుల్లవిరుపు మాటలు లేవు,

శ్రీకృష్ణ దామోదరుడిని చేరడానికి

పరితపిస్తున్నారు.

పాలూ నేయి వద్దని,

అలంకారాలు కాదని,

స్నేహంతో ఉంటామని ప్రతిన చేసి,

కలిసి వచ్చిన గోపకులకు శ్రీపాదాలేశరణమన్నదృశ్యమిది.

శ్రీహరి ముఖంలో చిరునవ్వును

నాటిన బాపు,

మూసిన కన్నుల వెనుక కాంతిని

మనసంతా నింపేసాడు.

ఆ మహా కళాకారుడు గీసినగీతలు

యమునాతరంగాలను తలపింపజేస్తున్నాయి.

ఇతర జీవకోటిలేనపుడు

తాను మాత్రమే ఉన్న విష్ణుని చేర్చేది

నమస్కారాలే. 17.12.23

3 తిరుప్పావై 

నెలమూడు వాన, వెన్నె సోనల వ్రేపల్లె

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్

ఇంతకూ ఈ వ్రతం జరిపిస్తే అసలైన ఫలం ఏమిటి? అంటే శ్రీ కృష్ణ సంశ్లేషమే! ఈ పనికి ఏ విధంగా సహాయం చేసినా మంచిదే జరుగుతుంది. ఆ పని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి తన వామనుడికి ఇంత తక్కువ అడుగుతావా అంటాడట. నాకు మూడడుగులిస్తా చాలు కదా అని వామనుడు అంటే, బలి ఆశ్చర్యపోతాడు.తీసుకుంటాడు. తీసుకున్న విధానం ఏమిటి?  శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా వచ్చిన వామనుడు అత్యంతానందాన్ని స్వీకరించారు. అప్పుడు త్రివిక్రముడవుతున్నాడు. ఆకాశమంత ఎత్తుకెదిగి, మూడు లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాలు ఆచరిస్తే ఇంకెందుకు దుర్భిక్షమం ఉంటుంది. నెలకు మూడు వర్గాలు కురుస్తాయి. పంటలన్నీ ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్దికి సంకేతాలే! ఇక పాలు పిదుక గోవుల పోదుగలను తాకగానే – కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కనుక వ్రతం చేసుకుందాం రండి. చెలికత్తెలు రమ్మంటున్నారు. గోదాదేవి.

మాడభూషి శ్రీధర్ తెలుగుభావార్థ గీతిక

మనసున నమ్మిన వారి గావ మరుగుజ్జుగా దిగి వచ్చినాడు

అంతలోనె ఆకాశానికెదిగి లోకాలనెల్ల పాదాల కొలిచినాడు

నోముస్నానాల పునీతమై త్రివిక్రముని నోరార వేడుదాము

నెలమూడు వానల, వెన్నెల సోనల వ్రేపల్లె సస్యశ్యామలంబు

ఎదిగిన పైరుల నిండిన జలాల త్రుళ్లి పడు మీన సంచయంబు

తెలుపుకలువపూల తెలవారుదాక నిదిరుంచు తుమ్మెదలు

కృష్ణువేణువు తాకి సేపులెగసి గోవులిచ్చును క్షీర కుంభవృష్ఠి

సిరిసంపదలకేమి కొదవ రారండి సిరినోము జేయ సీమంతులార.

బాపురే వ్యాఖ్యారేఖ

నీలి మేఘ శ్యాముడా, నీ మేఘానికీ అదే రంగు

బాల వటువును చూసి

అందరూ వామనుడనే అనుకున్నారు.

కన్నులు ప్రకాశిస్తున్నాయి.

ముఖంలో బాలతేజం ఉట్టి పడుతున్నది.

వటువు పట్టుకునే చత్రం అది.

అప్పడికే గగనాన్ని తాకినాడనడానికి ఛత్రాన్నితాకుతున్న మేఘాలు.

తలెత్తి చూస్తే త్రివిక్రముడు.

పాదాల చెంత గోపికలు. 

అప్పుడే కొలిచి నేలకు దిగినట్టు రెండో పాదం ఎంతో సింగారంతో ఉంది.

నీలి మేఘ శ్యాముడు.

కనుక మేఘాలకు తనకు ఒకే రంగు. అభయమిస్తున్నాడు ఆ బాల వటువు.

కలువపూల రేకుల దొప్పల వలె కనులు, దాని రెప్పలు కూడా కలువపూలే.

ఛాతిపైన,భుజాలకు తులసీ మాలలు, మెడలో వేలాడుతున్న జన్నిదం, అప్పుడే ఉపనయనం అయినట్టు వివరిస్తున్నాయి.

నిర్గుణపరబ్రహ్మ సగుణుడై

భక్తుల కీర్తనలందుకుంటున్నాడు.18.12.23

4. తిరుప్పావై

ఇదే తిరుప్పావై జ్ఞాన వర్షం, ఆమేఘ సందేశం

ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్ !

మేఘాన్ని నమస్కరిస్తున్నాడు. ఇది మేఘసందేశం. ఓ పర్జన్య దైవమా! వర్షం కురిపించడానికి  లోభత్వం ఎందుకు? నీవు సముద్రపు నీటి నంతా కడుపు నిండా త్రాగవయ్యా. ఆ తరువాత నీవు పైకెగసి, సృష్టికంతటికీ కారణభూతుడైన, ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ ఆ నలుపురంగును అద్దుకొండి. స్వామీ కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరసి రండి.  ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరంగా గర్జించండి. స్వామి సారంగం అనే ధనుస్సు నుంచి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించండి. మేమందరం యీ వర్ష ధారలలో స్నానం లో మునిగివెళదాం.  లోకము సుఖంగా వర్షించండి. మా వ్రతం నిరాటంకంగాచేసుకొందాం. ఇక ఏ మాత్రమూ ఆలస్యం వద్దు. వర్షించండి. స్వామీ!సర్వవ్యాపాకుడీ  త్రివిక్రముడు. ఆయన వ్యాపకత్వాన్ని తెలుసుకొనండి. ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను ఇదివరకే 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది.ఆ పరమాత్ముని యేమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలెంటే దానికి ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్ శుద్ధి అవసరం కద! అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థంచి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.

మాడభూషి తెలుగు భావార్థగీతిక

క్షార జలధి నావరించి అలల జలము పీల్చి గగనమెక్కి

జగత్కారకుడు, కాల స్వరూపుడు నల్లనయ్య రంగురాసి

గంభీర జలదము, మహనీయ సుందర బాహుదండుడైన

పద్మనాభు కుడిచేతి సుదర్శన చక్రంపు మెరుపు మెరిసి

స్థిరమైఎడమ దక్షిణావర్త పాంచజన్యంపు పిడుగులుమిసి,

ఆలసించక విష్ణు శార్ఞమ్మువిడిచిన శరపరంపరల విసిరి

పుడమి జీవరాశి బ్రతుక జీవధారలిచ్చు పర్జన్యదేవుమ్రొక్కి

మార్గళినోము స్నానాలు జేతము లేచి రారండు లేమలార.

బాపురే వ్యాఖ్యారేఖ

శంఖ చక్ర గదా శార్ఞపాణి విష్ణువు చిత్రం

నారాయణుడే మేఘం,ఓ మేఘమా నీవు దాతృత్వములో చూపే ఔదార్యాన్ని ఏమాత్రమూతగ్గించరాదు. గంభీరమైనసముద్రం మధ్యకు వెళ్లి,సముద్ర జలాన్ని త్రాగి, గర్జించి, ఆకాశమంతటా విస్తరించి, సర్వజగత్కారణ భూతుడైన నీలమేఘునివలె శ్యామల మూర్తియై,

ఆ పద్మనాభుని విశాలసుందర బాహుయుగళిలో

దక్షిణ బాహువునందలి చక్రమువలె మెరసి,

ఎడమచేతిలోని శంఖమువలె ఉరిమి,

శార్జ్గ్ మనే ధనుస్సు విడిచే బాణముల ములుకుల వర్షం వలె వర్షించు.

లోకమంతా సుభిక్షంగా ఉండేట్టు మేము సంతోషంతో మార్గశీర్ష స్నానము చేసేట్టుగా వర్షాన్ని కురిపించమని గోపికలు ప్రార్థిస్తున్నారు.

ఒక మేఘం మీద నిలిచి,

మరొకమేఘంమీద

శంఖ చక్ర గదా శార్ఞపాణి విష్ణువు చిత్రం అద్బుతం. 19.12.23

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles