నా కవిత
మనోసాగర మథనంలో
ఫురుటినొప్పుల పాట్లతో
జనించిన జీవ రసామృత భాండం
నా రాత
భావం బలిష్టం
భాష పటిష్టం
నా కవిత పరిపుష్టం
అది శారదా కటాక్షం
ఎంగిలి కూడు నిరసించే
ఒక కవి హృదయం
కవి సమయాల్లో
తన లోలోతుల్లోంచి
వెలువరించే ఓ ధార
అందులో మునిగి తేలిన
రస హృదయానికి
ఇహంలోనే ముక్తి
Also read: ‘‘అంతా మన మంచికేనా?’’
Also read: మహర్షి
Also read: “మహిళ”
Also read: “యుగ సామ్రాట్ గురజాడ”
Also read: ‘‘శాంతి’’