ఈ పసిబిడ్డడెంత తపియించునొ నీ చనుబాల కోసమై!
రేపను రోజు వృద్ధిగని, రెక్కలు వచ్చి, తరాలు మారగా,
ఈ పసివాడొకింత స్మరియించునె శైశవమాతృపాశమున్?
కాపురమిచ్చు నూతన సుఖానుభవమ్ముల, నొట్టి యావుదే
పాపము, కాడియెద్దదియు ప్రాతది, పోవలె వధ్యశాలకున్!
*
పాపము నీ ముఖాంబుజము వ్రాలినదేల విషాదముద్రతో?
కాపుర మెల్లవారికి సుఖాంతము నొందుట మిథ్య గాదె? సం
తాపపు హేతువయ్యును సదా మదిదోచెడు బోసినవ్వులన్,
తాపము తీరిపోవును, విధాతృ కృతమ్ములు మోహబంధముల్!
*
కాపురమెల్ల స్వర్గమగు కర్మ ఫలమ్ములు దక్కి, లేనిచో,
దీపములేని గేహమటు,దీన జరాభర దీర్ఘయామినిన్,
కాపురమున్ గ్రమించు
నరకమ్మొకటున్నదె జీవితేశ్వరీ?
నివర్తి మోహన్ కుమార్
Also read: జాషువా గబ్బిలం
Also read: గాఢ నిద్ర
Also read: దీపకథ