ప్రాధాన్యత క్రమంలో విస్తృత స్థాయిలో కోవిడ్-9 వేసుకుందుకు సన్నద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం
టీకాలు ఇవ్వడంలో వయసుమీరుతున్న వారికి, ఇతర అత్యవసర సర్వీసుల వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికి నిర్ణయించిన ప్రకారం ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వారికి టీకాలు ఇస్తారు.
టీకాలు ఇవ్వడానికి 50-60 ఏళ్ల మధ్య ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన వారు,అని రెండు భాగాలుగా వర్గీకరించారు. 50 ఏళ్లు పైబడిన వారిని లోక్ సభ, శాసనసభ ఎన్నికకు సంబంధించిన ఓటర్ల తాజా జాబితాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో టీకాలు ఇచ్చిన తరువాత కరోనా మహమ్మారి తీరతెన్నులు, వ్యాక్సిన్ లభ్యతను బట్టి మిగతా జనాభాకు టీకాలు వేస్తారు.
ఒక కేంద్రంలో రోజుకు వందమందికే టీకాలు వేస్తారు. అయితే ఆ కేంద్రంలో వెయిటింగ్ హాలు,పరీక్ష గది లాంటి మౌలికసదుపాయాలు ఉంటే రెట్టింపు మందికి టీకాలు వేస్తారు.
ఒక జిల్లాకు ఒకే కంపెనీకి చెందిన వ్యాక్సిన్ కేటాయించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలి.వ్యాక్సిన్లు భద్రపరిచే పెట్టెలు, వయల్స్, ఐస్ ప్యాక్ కు ఎండ తగలకుండా జాగ్రత్త వహించాలి. టీకాలు వేయడం ముగిసిన తరువాత ఐస్ ప్యాక్ లతో కూడిన టీకా పెట్టెను, మూత తెరవని వయల్స్ ను శీతల కేంద్రానికి పంపాలి.
ఇది చదవండి : ఉధృతంగా రైతుల ఆందోళన-పోలీసులకు కరోనా
ఇది చదవండి : కోవిడ్ టీకాపై ప్రణాళికలివ్వండి
టీకాలు వేయించుకోవాలనుకునేవారు కొవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ (కో-విన్) అనే డిజిటల్ వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఆధార్, ఓటర్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్ పత్రం తదితర 12 రకాల ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని ఉపయోగించుకోవాలి.ముందుగా నమోదు చేసుకున్న వారిని ప్రాధాన్యత క్రమంలో టీకాలు వేసే కేంద్రంలోకి అనుతిస్తారు. అప్పటికప్పుడు నమోదు ఉండదు.టీకాల నిల్వలను, నమోదు చేసుకున్న వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిం చేందుకు కో-విన్ ను ప్రభుత్వం ఉపయోగిస్తుంది.
అమెరికాలో నర్సుకు తొలి టీకా:
అమెరికాలో సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం (నిన్న) మొదలైంది. క్వీన్స్ లోని క్రిటికల్ కేర్ యూనిట్ లో నర్సుగా సేవలు అందిస్తున్న శాండ్రా లిండ్సే తొలి టీకా వేయించుకున్నారు. ఫైజర్ సంస్థ తయారు చేసిన ఈ టీకాను వేయించుకున్నతరువాత స్వస్థత వచ్చినట్లనిపించిందని ఆమె చెప్పారు. కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుంచి ఆమె సేవలు అందిస్తున్నారు.
ఇది చదవండి :ఉత్కంఠ కలిగిస్తున్న కోవిద్ టీకామందు