• వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రప్రభుత్వం
• డెడ్ లైన్ పై గడువును పెంచిన మోదీ సర్కార్
జనవరి 1 నుంచి ఫాస్టాగ్ డెడ్ లైన్ పై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇప్పటివరకూ డిసెంబరు 31 ఆఖరు తేదీగా నిర్ణయించింది. జనవరి 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను నిషేధించింది. కొత్త సంవత్సరం ఆరంభంనుంచి వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాహనదారుల ఇబ్బందుల దృష్ట్యా ఫాస్ట్ టాగ్ డెడ్ లైన్ పై కొత్త నిబంధనలను విడుదల చేసింది.
ఫాస్ట్ టాగ్ నిబంధనల సడలింపు:
ఫాస్ట్ టాగ్ గడువును ఫిబ్రవరి 15,2021 వరకూ పొడిగిస్తూ నిబంధనలను సవరించింది. ఫాస్ట్ టాగ్ ద్వారా ప్రస్తుతం 75 శాతం చెల్లింపులు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు మిగతా 25 శాతం చెల్లింపులను డిజిటల్ పద్దతిలో వసూలు చేసేందుకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఫాస్ట్ టాగ్ ద్వారా చెల్లింపులు చేయడంతో వాహనదారులు భారీ క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. దీంతో ఎంతో విలువైన సమయంతో పాటు ఇంధన వృథాని కూడ అరికట్టవచ్చు. అయితే పలు కారణాల రీత్యా ఇప్పటికీ ఫాస్ట్ ట్యాగ్ తీసుకోని వాహనదారులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో వీరికి మరో అవకాశం కల్పిస్తూ గడువును పొడిగిస్తూ నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది.
ఇది చదవండి : వాహనదారులారా బహుపరాక్ !